Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Nov 03 , 2026 | 06:33 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Nov 03, 2026 08:55 IST

    చిత్తూరు: కుప్పం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ

    • కుప్పం మున్సిపల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌లో 15 ఓట్లు

    • టీడీపీ అభ్యర్థి రాజ్‌కుమార్‌కి 15 ఓట్లు

  • Nov 03, 2026 08:50 IST

    ఎన్టీఆర్‌ జిల్లా: జగ్గయ్యపేటలో కౌంటింగ్‌ కేంద్రం దగ్గర వింత!

    • బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన రూమ్‌ కీ దొరకకపోవడంతో..

    • తాళాలు బద్దలుకొట్టిన సిబ్బంది

  • Nov 03, 2026 08:46 IST

    ప్రకాశం జిల్లాలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు

    • అల్లకల్లోలంగా సముద్రతీర ప్రాంతం

    • చీరాల, వేటపాలెం, కొత్తపట్నం, పాకలలో..

    • 30 అడుగులు ముందుకువచ్చిన సముద్రం

  • Nov 03, 2026 08:44 IST

    అల్లూరి జిల్లా: సీలేరు నదికి కొనసాగుతున్న వరద

    • జోలాపుట్‌ రిజర్వాయర్‌ నుంచి..

    • 10వేల క్యూసెక్కులు బలిమెల రిజర్వాయర్‌కు విడుదల

    • బలిమెల, గుంటవాడ రిజర్వాయర్ల నుంచి..

    • సీలేరు నదిలోకి కొనసాగుతున్న వరద

  • Nov 03, 2026 08:41 IST

    హైదరాబాద్‌లో నవంబర్ 21న పాస్‌పోర్ట్‌ మేళా

    • నేటి నుంచి 3 కేటగిరీల్లో స్లాట్‌లు విడుదల

    • హెల్ప్‌లైన్ నెంబర్లు 040-27715333 / 27715115

  • Nov 03, 2026 08:31 IST

    నెల్లూరు జిల్లాకు తప్పిన తుపాను ముప్పు

    • పొదలకూరు-సంగం రోడ్డులో కూలిన భారీ వృక్షం

    • వాహనాల రాకపోకలకు అంతరాయం

    • విద్యాసంస్థలకు నేడు సెలవు

  • Nov 03, 2026 07:52 IST

    AP మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌

    • భారీ వర్షాలతో చీరాలలో కౌంటింగ్ ఆలస్యం

    • చీరాలలో ఉ.11గంటలకు కౌంటింగ్

  • Nov 03, 2026 07:50 IST

    మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై తుపాను ఎఫెక్ట్

    • ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి..

    • చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ వాయిదా

    • కౌంటింగ్ వాయిదా వేసినట్టు కలెక్టర్ ప్రకటన

    • తుపాను ప్రభావం తగ్గిన తర్వాత..

    • కౌంటింగ్ జరుగుతుందని కలెక్టర్ వెల్లడి

  • Nov 03, 2026 07:48 IST

    ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్

    • ఏపీ వ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో కౌంటింగ్

    • 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీల్లో కౌంటింగ్

    • 3,186 వార్డలకు సంబంధించి ఓట్ల లెక్కింపు

    • ఏపీ వ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు

    • కౌంటింగ్ ప్రక్రియలో 47,817 మంది సిబ్బంది

  • Nov 03, 2026 07:09 IST

    మురసు తుపానుతో తెలంగాణలో అతి భారీ వర్షాలు

    • 2 జిల్లాలకు రెడ్‌, 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌

    • నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు

    • సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు

  • Nov 03, 2026 07:09 IST

    అమెరికాలోని 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు ఎన్నికలు

    • అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో..

    • మొత్తం 435 సీట్లు, సెనెట్‌లోని 35 స్థానాలతో పాటు..

    • 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు ఎన్నికలు

    • అమెరికాలో 50 రాష్ట్రాలు ఉండగా..

    • 46 రాష్ట్రాల చట్టసభలకు ఎన్నికలు

  • Nov 03, 2026 06:51 IST

    నేడు అమెరికా మిడ్‌-టర్మ్‌ ఎన్నికలు

    • బరిలో పలువురు భారతీయ అమెరికన్లు

    • న్యూయార్క్‌ అటార్నీ బరిలో తెలుగు మహిళ సరిత కోమటిరెడ్డి

  • Nov 03, 2026 06:50 IST

    నేడు ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    • ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌..

    • గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం..

    • ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు

  • Nov 03, 2026 06:49 IST

    తీరం దాటుతున్న మురసు తుపాను‌

    • తీరం దాటే ప్రక్రియ పూర్తికి మరో 2 గంటల సమయం

    • ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం

    • తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు

  • Nov 03, 2026 06:48 IST

    నిర్మల్‌లో నేడు బీజేపీ మహా పాదయాత్ర

    • నిర్మల్‌లో ఇవాళ బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి..

    • నేతృత్వంలో మహా పాదయాత్ర

    • హాజరుకానున్న ఇన్‌చార్జ్‌ సునీల్ బన్సల్‌, కేంద్రమంత్రి బండి సంజయ్‌

  • Nov 03, 2026 06:46 IST

    ఏపీలో పాఠశాలలకు నేడు సెలవు

    • తుపాను నేపథ్యంలో ఏపీలో పలు జిల్లాల్లో..

    • పాఠశాలలకు నేడు సెలవు

  • Nov 03, 2026 06:45 IST

    విజయవాడలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం

    • ప్రధాన రోడ్లతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం

  • Nov 03, 2026 06:43 IST

    తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా

    • ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని అధికారులకు సీఎం సూచన

    • ఆస్తి నష్టాన్ని వీలైనంతగా నియంత్రించాలన్న సీఎం

    • రేపల్లె, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో భారీ వర్షాలు..

    • కురుస్తున్నాయన్న బాపట్ల కలెక్టర్‌

    • నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఎన్టీఆర్‌..

    • కృష్ణా జిల్లాల్లో పరిస్థితిని వివరించిన సీఎం చంద్రబాబు

  • Nov 03, 2026 06:40 IST

    తుపాను పరిస్థితిపై కలెక్టర్లు, అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

    • తుపాను అర్ధరాత్రి ఒంటిగంటకు తీరం దాటినా..

    • పూర్తిగా తీరం దాటటానికి సమయం పడుతుందని..

    • సీఎం చంద్రబాబుకు వివరించిన అధికారులు

    • ఒంగోలు సమీపంలో కొత్తపట్నం దగ్గర..

    • తీరాన్ని మురసు తుపాను తాకినట్టు తెలిపిన అధికారులు

  • Nov 03, 2026 06:38 IST

    ఒంగోలు దగ్గర తీరాన్ని తాకిన మురసు తుపాను

    • ఉత్తర వాయువ్య దిశగా తుపాను పయనం