-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 28th October 2026 avn
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Oct 28 , 2026 | 07:02 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Oct 28, 2026 07:47 IST
‘అర్నబ్’ తుపాను:
కాకినాడ జిల్లాలో ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వర్షం
ప్రధాన రహదారులపై కూలిన చెట్లు
రాకపోకలకు అంతరాయం
ఉప్పాడలో సముద్రపు అలల తీవ్రతకు బీచ్ రోడ్డు ధ్వంసం
-
Oct 28, 2026 07:45 IST
‘అర్నబ్’ తుపాను:
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలపై అధికంగా తుపాను ప్రభావం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
కోనసీమ ప్రాంతంలో నేలకూలిన కొబ్బరిచెట్లు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
-
Oct 28, 2026 07:40 IST
‘అర్నబ్’ తుపాను:
యానాంకి దక్షిణంగా నరసాపురానికి సమీపాన తీరంలోకి ప్రవేశించిన ‘అర్నబ్’ తుపాను
పూర్తిగా తీరం దాటేందుకు మరికొంత సమయం పడుతుందన్న వాతావరణశాఖ
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం..
తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు