-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 16th November 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 16 , 2026 | 06:13 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Nov 16, 2026 07:04 IST
ప.గో: శివనామస్మరణతో మారుమోగుతున్న భీమవరం పంచారామ క్షేత్రం
తొలి సోమవారం కావడంతో సోమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు
తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్న అర్చకులు
-
Nov 16, 2026 06:51 IST
తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
నేటి మధ్యాహ్నం కల్యాణోత్సవ మండపంలో పుష్పయాగం నిర్వహించనున్న అర్చకులు
8 టన్నుల పుష్పాలతో శ్రీవారికి పుష్పార్చన నిర్వహించనున్న అర్చకులు
పుష్పయాగం సందర్బంగా శ్రీవారి ఆలయంలో జరిగే పలు అర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ
-
Nov 16, 2026 06:50 IST
తిరుపతి: కార్తీక సోమవారం సందర్భంగా కపిలేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
పిండి దీపాలు వెలిగించి పుష్కరిణి వద్ద మొక్కులు తీర్చుకున్న మహిళలు
-
Nov 16, 2026 06:43 IST
హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు ట్రాన్స్ జెండర్స్ అడ్వైజరీ కమిటీ దక్షిణ ప్రాంతీయ సమావేశం
నవంబర్ 16, 17 తేదీల్లో టూరిజం ప్లాజాలో సమావేశాలు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అడ్వైజరీ కమిటీ సమావేశం
ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, సాధికారతపై చర్చ
దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధుల హాజరు
సమావేశానికి హాజరుకానున్న ఛైర్‌పర్సన్ ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనన్
-
Nov 16, 2026 06:42 IST
నేడు ఫిలిప్పీన్స్‌లో ప్రధాని మోదీ పర్యటన
ఆగ్నేయాసియా దేశాలతో భారత్ బంధాన్ని మరింత బలోపేతం చేసేలా మరో టూర్‌కు శ్రీకారం
ఇవాళ, రేపు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో పర్యటన
-
Nov 16, 2026 06:42 IST
నేడు ఢిల్లీలో సోనియాగాంధీ ఆత్మకథ ఆవిష్కరణ
హాజరుకానున్న రాజకీయ, సాహిత్య ప్రముఖులు
-
Nov 16, 2026 06:40 IST
ఏపీకి తీవ్ర తుపాను ముప్పు
బంగాళాఖాతంలో బలపడనున్న వాయుగుండం
8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం
నేడు తుపానుగా మారనున్న వాయుగుండం
తుపానుగా మారాక అక్వాన్‌గా నామకరణం
-
Nov 16, 2026 06:40 IST
రాజమండ్రి పుష్కర్‌ఘాట్‌కు పోటెత్తిన భక్తులు
కార్తిక సోమవారం సందర్భంగా భక్తుల రాక
గోదావరి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు
కోటిలింగాల ఘాట్‌లోనూ భక్తుల రద్దీ
గాయత్రీ ఘాట్‌కు పోటెత్తిన భక్తులు
కార్తిక మాస పూజలతో ఘాట్ల దగ్గర ఆధ్యాత్మిక సందడి
-
Nov 16, 2026 06:40 IST
హైదరాబాద్: టోలిచౌకి మండి కింగ్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం
కిచెన్ డక్ట్‌లో పేరుకున్న ఆయిల్ కారణంగా వంట చేస్తుండగా మంటలు
మంటలను అదుపుచేసిన రెస్టారెంట్ సిబ్బంది
-
Nov 16, 2026 06:39 IST
హైదరాబాద్: టోలిచౌకి ఫ్లైఓవర్ దగ్గర రోడ్డు ప్రమాదం
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడిన కియా కారు
-
Nov 16, 2026 06:13 IST
నేడు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు
మండల-మకరవిళక్కు యాత్ర కోసం తెరవనున్న ఆలయం
లక్షలాది భక్తుల రాక దృష్ట్యా ఆలయం భారీ భద్రత ఏర్పాట్లు