Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Nov 10 , 2026 | 07:24 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Nov 10, 2026 07:58 IST

    ఢిల్లీ: నేడు రిక్రియేషనల్‌ క్రూయిజ్‌ ప్రారంభం

    • ప్రారంభించనున్న కేంద్రమంత్రి సర్బానంద్ సోనోవాల్

    • ఎలక్ట్రిక్ బస్సుల తరహాలోనే నదుల్లో క్రూజ్ సేవలు

    • ఇటీవల యమునా నదిలో విజయవంతంగా ట్రయల్ రన్

  • Nov 10, 2026 07:57 IST

    ఢిల్లీలో కొనసాగుతున్న ఎయిర్ ఎమర్జెన్సీ

    • ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి కాలుష్యం

    • ఢిల్లీలో 400 పాయింట్లు దాటిన AQI

    • ఢిల్లీ-NCR పరిధిలో గ్రాప్-III ఆంక్షలు

  • Nov 10, 2026 07:57 IST

    నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో మురుగు నీరు కలకలం

    • కుళాయిల్లో మురుగు నీరు వస్తుండటంతో విద్యార్థుల ఆందోళన

    • చర్మ వ్యాధులు వస్తున్నాయని ఆవేదన

    • బాసర ట్రిపుల్ ఐటీలో కొద్ది రోజులుగా తీవ్రమైన నీటి సమస్య

  • Nov 10, 2026 07:30 IST

    నేడు భారత్‌-న్యూజిలాండ్‌ మూడో వన్డే

    • హామిల్టన్‌లో ఉ.7:30 గంటల నుంచి మ్యాచ్‌

    • 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో భారత్

  • Nov 10, 2026 07:28 IST

    పశ్చిమగోదావరి: నరసాపురం వశిష్ఠ గోదావరిలో కార్తీక మాస సందడి

    • గోదావరిలో పుణ్యస్నానాలు

    • నదిలో దీపాలు విడిచిపెట్టిన మహిళలు

    • వలంధర రేవులో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులకు తప్పని ఇక్కట్లు

  • Nov 10, 2026 07:27 IST

    తూర్పుగోదావరి: ప్రారంభమైన కార్తీక మాసం

    • మొదటి రోజు కావడంతో కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో పుణ్య స్నానాలు చేసి గోదావరి నదిలో దీపాలు వదులుతున్న భక్తులు

  • Nov 10, 2026 07:24 IST

    నంద్యాల: శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మహోత్సవాలు

    • నెల రోజులపాటు అభిషేకాల నిలుపుదల

    • శని, ఆది, సోమ పర్వదినాల్లో స్పర్శ దర్శనం రద్దు