Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 24 , 2026 | 07:29 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Apr 24, 2026 08:23 IST

    మహబూబాబాద్: జిల్లాలో తీవ్రమైన వంటగ్యాస్ కొరత

    • నర్సింహులపేట మండల కేంద్రంలో వంట గ్యాస్ కోసం బారులు తీరిన ప్రజలు

    • పోలీస్ పహారా మధ్య గ్యాస్ పంపిణీ

  • Apr 24, 2026 07:46 IST

    ట్రంప్ ప్రభుత్వం దూకుడు.. పౌరసత్వాల రద్దుకు రెడీ!

    • విదేశాల్లో పుట్టిన 384 మంది పౌరసత్వాల రద్దుకు రంగం సిద్ధం

    • మరింత మందిని గుర్తించేందుకు ప్రయత్నాలు

    • అంతర్జాతీయ మీడియాలో కథనాలు

  • Apr 24, 2026 07:46 IST

    డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతిపట్ల మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

    • శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: పొన్నం

    • ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందొద్దు: మంత్రి పొన్నం

    • క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు: పొన్నం

    • సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతున్నాం: పొన్నం

  • Apr 24, 2026 07:32 IST

    కర్నూలు: ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో విషాదం

    • వంశీ-మనోజ్ స్నేహితుల మధ్య ఘర్షణ

    • మనోజ్ మెడపై కత్తితో పొడిచిన వంశీ, మనోజ్ మృతి

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Apr 24, 2026 07:32 IST

    వరంగల్‌: నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌(55) మృతి

    • రాత్రి 2:30 గంటల సమయంలో డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ మృతి

    • నిన్న పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్‌ గౌడ్‌

    • కంచన్‌బాగ్‌ డీఆర్‌డీఓ అపోలోలో చికిత్స పొందుతూ మృతి

    • శంకర్‌ గౌడ్‌ డెడ్‌బాడీకి పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించిన వైద్యులు

  • Apr 24, 2026 07:29 IST

    నేడు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం

    • ఉదయం10 గంటలకు భేటీకానున్న ఉద్యోగ సంఘాలు

    • తర్వాత డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నంతో చర్చలు