ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజ్.. ‘కోస్టల్ కర్ణాటక’ టూర్ వివరాలు ఇవే
ABN , Publish Date - Aug 05 , 2026 | 04:06 PM
ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు సముద్ర తీర అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ‘కోస్టల్ కర్ణాటక’ టూర్ ప్యాకేజ్‌ను అందిస్తోంది. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ 5 రాత్రులు–6 రోజుల యాత్రలో ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆధ్యాత్మిక యాత్రతో పాటు సముద్ర తీరాల అందాలు, ప్రకృతి సోయగాలను ఒకే ట్రిప్‌లో ఆస్వాదించాలని భావిస్తున్న వారికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీని అందిస్తోంది. 'కోస్టల్ కర్ణాటక' పేరుతో రూపొందించిన ఈ 5 రాత్రులు–6 రోజుల టూర్‌లో ఉడుపి, కొల్లూరు, మురుడేశ్వర్, గోకర్ణ, హొరనాడు, శృంగేరి, మంగళూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి మంగళవారం ఈ యాత్ర ప్రారంభమవుతుంది.
ప్యాకేజ్ వివరాలు
ప్యాకేజ్ పేరు: కోస్టల్ కర్ణాటక
ప్యాకేజ్ కోడ్: SHR085
ప్రారంభ కేంద్రం: కాచిగూడ రైల్వే స్టేషన్, హైదరాబాద్
ప్రయాణ విధానం: రైలు
రైలు నంబర్: కాచిగూడ–మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (12789/12790)
ప్రయాణ ప్రారంభ సమయం: ఉదయం 6:05 గంటలు
టూర్ : ప్రతి మంగళవారం
తరగతులు: స్లీపర్ (Standard), 3AC (Comfort)
6 రోజుల టూర్
మొదటి రోజు: ప్రతి మంగళవారం ఉదయం కాచిగూడ నుంచి రైలులో ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
రెండో రోజు: ఉదయం మంగళూరు చేరుకుని అక్కడి నుంచి ఉడుపికి వెళ్తారు. హోటల్‌లో విశ్రాంతి తీసుకున్న తర్వాత శ్రీకృష్ణ ఆలయం, మల్పే బీచ్‌ను సందర్శిస్తారు. రాత్రికి ఉడుపిలో బస ఉంటుంది.
మూడో రోజు: ఉదయం కొల్లూరులోని శ్రీ మూకాంబికా ఆలయాన్ని దర్శిస్తారు. అనంతరం మురుడేశ్వర్‌లోని ప్రసిద్ధ శివాలయం, భారీ శివుని విగ్రహాన్ని వీక్షిస్తారు. ఆ తర్వాత గోకర్ణ మహాబలేశ్వర ఆలయం, సముద్రతీరాన్ని సందర్శించి తిరిగి ఉడుపికి చేరుకుంటారు.
నాలుగో రోజు: హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసిన తర్వాత హొరనాడు లోని అన్నపూర్ణేశ్వరి ఆలయం, అనంతరం శృంగేరిలోని శారదాంబ ఆలయాన్ని దర్శించి సాయంత్రానికి మంగళూరుకు చేరుకుంటారు. అక్కడే రాత్రి బస ఉంటుంది.
ఐదో రోజు: మంగళూరు నగరంలోని మంగళాదేవి ఆలయం, కద్రి మంజునాథ ఆలయం, కుద్రోలి గోకర్ణనాథ ఆలయం, తన్నీర్భవి బీచ్ వంటి ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తారు. సాయంత్రం మంగళూరు సెంట్రల్ స్టేషన్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
ఆరవ రోజు: రాత్రి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజ్ ధరలు
3AC
సింగిల్ షేరింగ్ – ₹41,630
ట్విన్ షేరింగ్ – ₹23,670
ట్రిపుల్ షేరింగ్ – ₹19,000
స్లీపర్
సింగిల్ షేరింగ్ – ₹38,600
ట్విన్ షేరింగ్ – ₹20,650
ట్రిపుల్ షేరింగ్ – ₹15,970
నాలుగు నుంచి ఆరు మంది కలిసి బుకింగ్ చేసుకుంటే మరింత తక్కువ ధరల్లో ఈ ప్యాకేజీ లభిస్తుంది.
ప్యాకేజీలో కల్పించే సౌకర్యాలు
స్లీపర్ లేదా 3AC రైలు ప్రయాణం
స్థానికంగా ఏసీ వాహనంలో రవాణా
మూడు రాత్రుల హోటల్ వసతి
మూడు రోజుల అల్పాహారం
షెడ్యూల్ ప్రకారం పూర్తిగా సైట్‌సీయింగ్
ట్రావెల్ ఇన్సూరెన్స్
టోల్, పార్కింగ్, జీఎస్‌టితో సహా ఇతర పన్నులు
ప్యాకేజీలో లేని సేవలు
మధ్యాహ్న, రాత్రి భోజనం
రైలులో ఆహారం
ఆలయ ప్రత్యేక దర్శన టికెట్లు, ప్రవేశ రుసుములు
బోటింగ్, హార్స్ రైడింగ్ వంటి వినోద కార్యక్రమాలు
టూర్ గైడ్ సేవలు
వ్యక్తిగత ఖర్చులు, ఇతర అదనపు సేవలు
హోటల్ వసతి
ఉడుపి: వైట్ లోటస్ లేదా సమాన స్థాయి హోటల్
మంగళూరు: జింగర్ హోటల్ లేదా సమాన స్థాయి హోటల్
ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనం, కర్ణాటక తీర ప్రాంతంలోని అందమైన బీచ్‌లు, ప్రకృతి సోయగాలు, చారిత్రక ప్రదేశాలను ఒకే యాత్రలో చూడాలనుకునే వారికి ఈ ఐఆర్‌సీటీసీ కోస్టల్ కర్ణాటక ప్యాకేజ్ మంచి ఎంపిక. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సౌకర్యం ఉండటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సౌకర్యవంతంగా ఈ యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ప్రెషర్ కుక్కర్ విజిల్ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్
దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు