వేసవిలో మీ స్కిన్ సేఫ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ABN , Publish Date - Mar 22 , 2026 | 02:43 PM
వేసవిలో ఎండ, చెమట, కాలుష్యం వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ట్యాన్, పొడిబారడం, మొటిమలు వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఇంటర్నెట్ డెస్క్: వేసవి కాలంలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. ఎండ తీవ్రత, చెమట, కాలుష్యం వల్ల చర్మంపై ప్రభావం పడుతుంది. అందుకే ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన చిట్కాలను పాటిస్తే మీ చర్మం ఆరోగ్యంగా, తాజాగా ఉంటుంది.
స్క్రబ్బింగ్ చేయాలి
చెమట వల్ల చర్మంపై దుమ్ము, మలినాలు పేరుకుపోతాయి. కేవలం ముఖం కడుక్కోవడం సరిపోదు. వారానికి 1-2 సార్లు స్క్రబ్బింగ్ చేస్తే మృత కణాలు తొలగిపోతాయి. సహజ పదార్థాలతో స్క్రబ్ చేయడం ఉత్తమం.
తక్కువ మేకప్ వేసుకోవాలి
వేసవిలో ఎక్కువ మేకప్ వేసుకోవడం చర్మానికి హానికరం. ముఖ్యంగా నూనె ఆధారిత ఉత్పత్తులు దూరంగా ఉంచాలి. తేలికపాటి మేకప్, లైట్ పౌడర్, లిప్ బామ్ వాడితే సరిపోతుంది.
సన్‌స్క్రీన్ తప్పనిసరి
బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ తప్పనిసరిగా రాయాలి. మీ చర్మానికి సరిపోయే SPF ఉన్నదాన్ని ఎంచుకోండి. ఎక్కువసేపు బయట ఉంటే ప్రతి 2 గంటలకు ఒకసారి మళ్లీ రాయడం మంచిది.
చర్మానికి రెగ్యులర్ కేర్
ముఖం, పాదాల సంరక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. వీలైతే ఫేషియల్స్ చేయించుకోవాలి. లేకపోతే ఇంట్లోనే సహజ పద్ధతులతో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.
ఎక్కువగా నీరు తాగండి
వేసవిలో శరీరంలో నీరు తగ్గిపోతుంది. అందుకే రోజుకు ఎక్కువగా నీరు తాగాలి. కొబ్బరి నీరు, పండ్ల రసాలు, మజ్జిగ కూడా తీసుకోవడం మంచిది. ఇవి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.
చల్లటి నీటితో స్నానం చేయండి
వేసవిలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల చెమట తగ్గుతుంది. చర్మం తాజాగా ఉంటుంది. పొడిబారడం, చర్మ సమస్యలు తగ్గుతాయి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి
తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. ఇవి చర్మానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి.
రోజువారీ స్కిన్ కేర్ పాటించండి
క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ వంటి దినచర్యను పాటించాలి. అవసరమైతే ఫేషియల్ స్ప్రే వాడాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, మండే వేసవిలో కూడా మీ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం
పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి
For More Latest News