Memory Tips: మీరు స్టూడెంటా? చదివింది ఎక్కువ కాలం పాటు గుర్తుండిపోవాలంటే..
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:39 PM
చదివిన విషయాలు ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే స్టూడెంట్స్ కొన్ని టిప్స్ తప్పనిసరిగా పాటించాలి. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది విద్యార్థులు తాము చదివింది గుర్తుపెట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. గంటల పాటు చదివినా పరీక్షల్లో విషయాలు టక్కున గుర్తురాక నిరాశకు లోనవుతారు. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఈ పరిస్థితి నుంచి సులువుగా బయటపడొచ్చు.
పుస్తకాలను ఓ క్రమపద్ధతిలో అమర్చుకుంటే మనసుపై సానుకూల ప్రభావం పడుతుంది. ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన ఫైల్స్‌ను వేర్వేరుగా పెట్టుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది
పదే పదే విషయాలను పునశ్చరణ చేసుకుంటే విషయాలు చాలా కాలం పాటు గుర్తుండిపోతాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. పలుమార్లు విన్న పాట ఎలాగైతే గుర్తుండిపోతుందో పాఠ్యాంశాలు కూడా అంతే సులువుగా జ్ఞాపకముంటాయని చెబుతున్నారు.
విద్యార్థులు తాము చదివిన విషయాలను ఇతరులతో చర్చిస్తే కూడా అవి కలకాలం గుర్తుండిపోతాయి. అంతేకాకుండా, పాఠ్యాంశాలపై లోతైన అవగాహన ఏర్పడుతుంది. తాము చదువుకున్న విషయాల గురించి స్టూడెంట్స్ తమ తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా స్నేహితులతో డిస్కస్ చేయొచ్చు.
మెదడు సామర్థ్యాలను పెంచుకునేందుకు విద్యార్థులు చదరంగం, క్విజ్‌లు, చిక్కుముడులు వంటివి పరిష్కరించేందుకు ట్రై చేయాలి. ఇలా చేస్తే మెదడుకు పదును పెట్టినట్టు అవుతుంది. పాఠ్యాంశాలు సులువుగా గుర్తుంటాయి.
చిత్రాల సాయంతో పాఠ్యాంశాలు నేర్చుకుంటే మనసులో అవి మరింత బలంగా నాటుకుంటాయి.
ఒకేసారి పాఠ్యాంశం మొత్తన్ని చదివేసేందుకు ప్రయత్నించకూడదు. ముందుగా పాఠ్యాభాగాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించాలి. ఆ తరువాత ఒక్కో భాగాన్ని జాగ్రత్తగా ప్రశాంతమైన మనస్సుతో చదువుకుంటే చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది.
ఇలాంటి ట్రిక్స్ పాటించడంతో పాటు చదువుపై ఆసక్తితో ముందుకు కదిలితే చదివేది ఎంత సంక్లిష్ట పాఠమైనా సులువుగా గుర్తుండిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ టిప్స్‌ను అమల్లో పెట్టేయండి.
ఇవీ చదవండి:
ఈ దేశాల్లో పిల్లల భవిష్యత్తుకు భరోసా! అద్భుత జీవితం గ్యారెంటీ
పుస్తకపఠనం అలవాటు ఎక్కువగా ఉన్న దేశాలు ఏవో తెలుసా