Travel Gadgets: ప్రయాణాల్లో వెంట ఉండాల్సిన 8 గ్యాడ్జెట్స్
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:31 PM
తరచూ ప్రయాణాలు చేసేవారు తమ వెంట తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన గ్యాడ్జెట్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో గ్యాడ్జెట్స్ ఎంతో అవసరం. ఇక పర్యటనలు చేసే ప్రతి ఒక్కరు తమ వద్ద తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన గ్యాడ్జెట్స్ కొన్ని ఉన్నాయి. ఇవి వెంట ఉంటే చాలా సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం (travel gadgets essentials).
హనీవెల్ జెస్ట్ చార్జెర్
అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్‌కు అవకాశం ఇచ్చే ఈ చార్జర్ గ్లోబల్ ప్లగ్ కంపాటబిలిటీ ఉంటుంది. అంటే అన్ని రకాల ప్లగ్స్‌లో దీన్ని పెట్టొచ్చు. ఇందులో మూడు టైప్ సీ పీడీ పోర్టులు, ఒక యూఎస్‌బీ ఏ పోర్టు ఉంటాయి.
పోర్ట్రానిక్స్ పవర్ 65 వాల్ చార్జర్
ఇందులో డ్యూయెల్ టైప్-సీ, యూఎస్‌బీ-ఏ పోర్టులు ఉంటాయి. ఇది 65 వాట్స్ వేగవంతమైన ఔట్‌పుట్ అందిస్తుంది. లాప్‌టాప్‌లు, టాబ్లెట్స్, ఇతర ఫోన్స్ చార్జ్ చేసేందుకు ఇది ఉపయుక్తం
యూఆర్‌బీఎన్ 10,000 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్
ఈ లైట్‌వెయిట్ పవర్ బ్యాంక్‌లో ఫాస్ట్ చార్జింగ్ సౌలభ్యం ఉంది. టైప్-సీ, యూఎస్‌బీ-ఏ పోర్టులు ఉన్నాయి. దీనికి బీఐఎస్ సర్టిఫికేషన్ కూడా ఉంది.
డైసన్ జోన్ ఎయిర్ ప్యూరిఫయ్యింగ్ హెడ్‌ఫోన్స్
దీంట్లో బయటి శబ్దాలు చెవిన పడకుండా నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు ఎయిర్ ప్యూరిఫయ్యింగ్ ఫీచర్ కూడా ఉంది. బయటి కాలుష్యం చెవిలోకి చేరకుండా అడ్డుకుంటుంది. మంచి నాణ్యతతో కూడిన శబ్దం అందిస్తుంది.
నాయిస్ ఎక్స్‌ప్లోరర్ స్మార్ట్ వాచ్
పిల్లల కోసం ఉద్దేశించిన ఈ స్మార్ట్ వాచ్‌లో జీపీఎస్ ట్రాకింగ్, ఎస్ఓఎస్ అలర్ట్, కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. ప్రయాణాల్లో పిల్లల భద్రతకు ఇది అత్యంత ఉపయుక్తం
శామ్‌సంగ్ గ్యాలెక్సీ స్మార్ట్ ట్యాగ్ 2
లగేజీ, తాళం చెవులు, లేదా పెంపుడు జంతువులను ట్రాక్ చేసేందుకు ఈ స్మార్ట్ ట్యాగ్ అత్యంత అనువైనది. శామ్‌సంగ్‌కు చెందిన స్మార్ట్ థింగ్స్ ఫైండ్ నెట్‌వర్క్ ఫీచర్‌తో దీన్ని చక్కగా వినియోగించుకోవచ్చు.
పోర్ట్రానిక్స్ ఆటో 10 ఆటో కార్ బ్లూటూత్ రిసీవర్
పాత కార్లకు బ్లూటూత్ కాలింగ్, మ్యూజిక్ ప్లేయింగ్ పీచర్స్ జోడించేందుకు ఈ రిసీవర్ అద్భుతంగా పని చేస్తుంది. డ్యూయెట్ యూఎస్‌బీ పోర్ట్స్ ఉన్న 12వీ సాకెట్‌కు దీన్ని అనుసంధానించి హ్యాపీగా బ్లూటూత్ ఫీచర్‌లను వాడుకోవచ్చు.
డైసన్ సూపర్ సానిక్ హెయిర్ డ్రయ్యర్
ప్రయాణాల్లో ఉండేవారికి ఇది అత్యంత అనుకూలమైనది. దీంతో, జుట్టును త్వరగా ఆరబెట్టుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
విహారయాత్రకు వెళ్లే వారి స్మార్ట్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవి
ఫ్లైట్ ఆలస్యమైందా.. సడెన్‌గా క్యాన్సిల్ అయ్యిందా.. పరిహారం ఎంతిస్తారో తెలుసా
మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి