Share News

Marital Relationship Tips: భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి అసలు కారణం ఇదేనా?

ABN , Publish Date - Jan 03 , 2026 | 04:09 PM

వైవాహిక జీవితంలో సమస్యలు రావడం సహజం, కానీ చాలా సందర్భాల్లో అసలు సమస్యలు మన భాగస్వామిని మనం చూసే ప్రతికూల దృక్పథం వల్లే మొదలవుతాయి.

Marital Relationship Tips: భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి అసలు కారణం ఇదేనా?
Marital Relationship Tips

ఇంటర్నెట్ డెస్క్: వైవాహిక జీవితంలో సమస్యలు రావడం సహజం. కానీ చాలా సార్లు అసలు సమస్యలు బయటి వ్యక్తుల వల్ల కాకుండా, మన భాగస్వామిని మనం చూసే దృక్పథం వల్లే మొదలవుతాయి. విషయాలను ఎప్పుడూ ప్రతికూలంగా చూస్తే, సంబంధంలో దూరం పెరుగుతుంది. ఈ ప్రతికూల ఆలోచనలను మార్చుకుంటే, భార్యాభర్తల మధ్య ఉన్న అనేక సమస్యలను పరిష్కరించవచ్చని నిపుణులు చెబుతున్నారు.


భార్యాభర్తల జీవితంలో మంచి కంటే చెడు ఎక్కువ ప్రభావం చూపుతుంది. అదే పరిస్థితి ఇతర సంబంధాల్లోనూ కనిపిస్తుంది. చిన్న గొడవల వల్లే భాగస్వామిని ప్రతికూలంగా చూడడం మొదలవుతుంది. దీనినే నిపుణులు ‘ప్రతికూల భావోద్వేగం’ అంటారు. ఈ భావనను దాటుకుని, ఎదుటి వ్యక్తిలో మంచిని చూడగలిగితే సంబంధం బలపడుతుంది.

బంధాన్ని బలపరుస్తున్నామా.. ?

మన భాగస్వామితో బంధం బలపడాలా లేదా అన్నది పూర్తిగా మన దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. మనం వారిలో మంచి విషయాలను చూస్తే సమస్యలు తక్కువగా ఉంటాయి. కానీ, ప్రతి విషయాన్ని ప్రతికూలంగా చూడడం మొదలుపెడితే అసలు సమస్యలు మొదలవుతాయి.


ప్రతికూల భావాలు ఎందుకు వస్తాయి?

  • భార్యాభర్తల మధ్య గొడవలు, అభిప్రాయ భేదాలు రావడం సహజం. కానీ ప్రతి గొడవ తర్వాత ఒకరినొకరు ప్రతికూలంగా చూడడం ప్రమాదకరం.

  • నమ్మకం వైవాహిక జీవితానికి పునాది. కానీ కొన్ని కారణాల వల్ల నమ్మకం తగ్గితే, అనుమానాలు పెరుగుతాయి. అవి క్రమంగా ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయి. అందుకే ఏ విషయమైనా స్పష్టంగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం.

  • పనుల ఒత్తిడి వల్ల కలిసి గడిపే సమయం తగ్గితే, ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. దీని వల్ల ఒకరి గురించి ఒకరికి తప్పు అభిప్రాయం ఏర్పడుతుంది.

  • తరచూ గొడవలు జరిగితే, భాగస్వామిని చూసే దృక్పథం పూర్తిగా ప్రతికూలంగా మారుతుంది.

  • కొంతమంది తమ భాగస్వామి మాట వినరు, తామే సరైనవాళ్లమని భావిస్తారు. అలాంటి వారు ఎదుటి వ్యక్తిలో మంచిని చూడలేరని నిపుణులు చెబుతున్నారు.


చిన్న మార్పులతో బంధం బలపడుతుంది

  • ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రతికూల దృక్పథాన్ని మార్చుకోవడం చాలా అవసరం. అప్పుడే సంబంధం బలపడుతుంది. భార్యాభర్తలు ఎక్కువ సమయం కలిసి గడిపితే, వారి మధ్య సానుకూలత పెరుగుతుంది. ప్రతి విషయంలో పారదర్శకంగా ఉండాలి, సానుకూలంగా మాట్లాడుకోవాలి. అసలు సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకునేందుకు ఒకరినొకరు నిందించకుండా చర్చించాలి. ఇద్దరూ ఒకరి వ్యక్తిగత సమయాన్ని గౌరవించుకోవాలి. ఇది బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది.

  • మన ఆలోచనలు సానుకూలంగా ఉంటే, ఇతరులను కూడా అలాగే చూస్తాం. అందుకే నిపుణులు స్వీయ ప్రేమ చాలా ముఖ్యం అంటున్నారు. మీకు నచ్చిన పనులు చేయడం, మీకు ఆనందం కలిగించే విషయాలకు సమయం కేటాయించడం అవసరం.

  • మీ భాగస్వామి చేసే పనిని అభినందించడం, అప్పుడప్పుడు చిన్న బహుమతులు ఇవ్వడం, ప్రేమను వ్యక్తపరచడం వంటి చిన్న విషయాలు కూడా సంబంధంలో సానుకూలతను పెంచుతాయి.

  • ఈ ప్రయత్నాలన్నీ చేసినా పరిస్థితి మారకపోతే, నిపుణుల సలహా తీసుకోవడం లేదా కౌన్సెలింగ్‌కు వెళ్లడం కూడా మంచి పరిష్కారం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.


Also Read:

ఈ సమస్యలు ఉన్నవారు బాదం తినకపోవడం మంచిది.!

గుడ్డు చెడిపోయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?

For More Latest News

Updated Date - Jan 03 , 2026 | 04:11 PM