Share News

Nayanthara: ట్యాగ్‌లైన్‌ ఇష్టమే కానీ...

ABN , Publish Date - Jan 11 , 2026 | 07:00 AM

ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటుంటారు. కానీ, విజయవంతమైన, సంతోషంగా ఉన్న స్త్రీ వెనుక కూడా ఒక పురుషుడు కచ్చితంగా ఉంటాడని అంటున్నారు ప్రముఖ కథానాయిక నయనతార. నేనే దీనికి ఉదాహరణ అని, నా భర్త విఘ్నేశ్‌ ప్రతీ విషయంలో నాకు తోడుగా ఉంటూ ప్రోత్సహిస్తాడన్నారు. నా నిర్ణయాలను ఎప్పుడూ ప్రశ్నించలేదని ఆమె అన్నారు.

Nayanthara: ట్యాగ్‌లైన్‌ ఇష్టమే కానీ...

నయనతార.... ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటినా, ఇప్పటికీ హీరోయిన్‌గా అదే జోష్‌ కొనసాగిస్తూ... వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఈతరం హీరోయిన్లలో అత్యధిక చిత్రాల్లో (80+) నటించిన ఘనత నయన్‌దే. తాజాగా ‘మన శంకరవరప్రసాద్‌ గారు’తో ఈ సంక్రాంతికి వస్తున్న సందర్భంగా ఆమె పంచుకున్న కొన్ని ముచ్చట్లివి...

ప్లాస్టిక్‌ సర్జరీ... నో ఛాన్స్‌...

నా కనుబొమలంటే నాకు చాలా ఇష్టం. వాటి ఆకారం ఎప్పుడూ మారుస్తూ ఉంటాను. ప్రతీ రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్లకు ముందు వాటిని మారుస్తుంటా. వాటి కోసం చాలా సమయాన్ని వెచ్చిస్తా. కనుబొమల ఆకారం మారినప్పుడల్లా ముఖంలో మార్పు కనిపించడం సహజం. అది తెలియక ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నానని అంటారు. నిజానికి ముఖంలో మార్పులు రావడానికి చాలా కారణాలుంటాయి. ఒక్కోసారి డైటింగ్‌ వల్ల బుగ్గలు లోపలికి వెళ్లినట్టు కనిపిస్తాయి. మరోసారి బుగ్గలు వచ్చినట్టు కనిపిస్తుంటాయి. (చిన్నగా నవ్వుతూ) కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడొచ్చు. నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్‌ ఉండదు.


book1.2.jpg

పుట్టినరోజు... ఖరీదైన కారు ...

ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటుంటారు. కానీ, విజయవంతమైన, సంతోషంగా ఉన్న స్త్రీ వెనుక కూడా ఒక పురుషుడు కచ్చితంగా ఉంటాడు. నేనే దీనికి ఉదాహరణ. నా భర్త విఘ్నేశ్‌ ప్రతీ విషయంలో నాకు తోడుగా ఉంటూ ప్రోత్సహిస్తాడు. నా నిర్ణయాలను ఎప్పుడూ ప్రశ్నించలేదు. నాకు ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిస్తాడు. నేనంటే ఆయనకు ఎంతో ప్రేమ. నా ప్రతీ పుట్టినరోజున ఖరీదైన కార్లను బహుమతిగా ఇస్తుంటాడు. ఈ ఏడాది రోల్స్‌ రాయిస్‌ బ్లాక్‌ బ్యాడ్జ్‌ స్పెక్టర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి ప్రేమను చాటాడు.


book1.3.jpg

అదే ఇష్టం...

అభిమానులు ఎంతో ప్రేమగా నన్ను ‘లేడీ సూపర్‌స్టార్‌’ అని పిలుస్తుంటారు. అలాంటి ట్యాగ్‌లైన్‌లు వెలకట్టలేనివి. అలా పిలవడం సంతోషాన్ని ఇస్తున్నప్పటికీ, కంఫర్ట్‌గా ఉండలేకపోతున్నా. అందుకే నన్ను నా పేరుతో (నయనతార అని) పిలిస్తే చాలు. నయనతార పేరే నా హృదయానికి దగ్గరైంది. ఆ పేరు నటిగానే కాకుండా వ్యక్తిగానూ నేనేంటో తెలియజేస్తుంది. అదే నాకూ ఇష్టం.


book1.jpg

ఒకరు నెమ్మది.. మరొకరు చలాకీ..

మా పిల్లలు ఉయిర్‌, ఉలగ్‌ కవలలైనా ఇద్దరి స్వభావాలు మాత్రం వేరు. ఒకరు చాలా నెమ్మది. మరొకరు బాగా చలాకీ. వారిద్దర్నీ అర్థం చేసుకోవడం నాకు ఒక నిరంతర అధ్యయనమే. షూటింగ్స్‌తో ఎంత అలసిపోయినా... ఇంటికొచ్చాక వారి చిరునవ్వు చూస్తే చాలు ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది. వాళ్లు నిద్రపోయినా సరే నేను కబుర్లు చెప్తూనే ఉంటా. నిద్రలో ఉన్నప్పుడు కూడా నా మాటల్ని వాళ్లు వింటారని నమ్ముతా. ఇదివరకు నా భయమంతా నా కెరీర్‌ గురించే ఉండేది. కానీ ఇప్పుడు పిల్లల గురించే నా దిగులంతా. వాళ్లు సురక్షితంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? అని ప్రతీ క్షణం ఆలోచిస్తుంటా. ఆ భయమే నన్ను మరింత అప్రమత్తంగా, బాధ్యతగా మార్చిందనిపిస్తుంది.


book1.4.jpg

మై హీరోస్‌..

ఇప్పటిదాకా కలిసి పనిచేసిన కథానాయకుల గురించి చెప్పాలంటే...

- చిరంజీవి: మెగా నటుడైనా, చాలా నిరాడంబరంగా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే లక్షణం ఆయనది.

- వెంకటేశ్‌: నా మొదటి తెలుగు హీరో. ఆయనతో సెట్‌లో ఉంటే ఫ్యామిలీతో ఉన్నట్టుగా ఉంటుంది.

- నాగార్జున: అందగాడు


- ప్రభాస్‌: స్వీట్‌ హార్ట్‌. ఎంతో సరదాగా మాట్లాడేవాడు. పెద్దస్టార్‌ అయ్యాడు.

- బాలయ్య: సరదా మనిషి. ఆయనతో మాట్లాడటానికి అందరూ భయపడతారు కానీ ఆయన మాత్రం అందరితో బాగా మాట్లాడతారు.

- రవితేజ: రవి, నేనూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. సెట్‌లో ఉన్నప్పుడు హిందీలోనే మాట్లాడుకునేవాళ్లం.

- ఎన్టీఆర్‌: తారక్‌ బాగా అల్లరి చేస్తాడు. నాపై జోక్స్‌ వేసేవాడు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు షాక్.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

దారి మళ్లింది 42 కోట్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 11 , 2026 | 07:47 AM