ఇండక్షన్ స్టవ్ వాడిన వెంటనే ఆఫ్ చేస్తున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి..
ABN , Publish Date - Mar 16 , 2026 | 02:18 PM
ఇండక్షన్ స్టవ్‌ను ఉపయోగించిన వెంటనే ఆఫ్ చేయడం చాలా మంది చేసే సాధారణ తప్పు. ఇలా చేయడం వల్ల స్టవ్ పనితీరు దెబ్బతిని, నష్టం కలగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండక్షన్ స్టవ్‌ను ఉపయోగించిన వెంటనే చాలామంది దాన్ని ఆఫ్ చేసి ప్లగ్ తీసేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల స్టవ్ పనితీరు దెబ్బతినవచ్చు. కంపెనీలు ఇచ్చే సూచనల ప్రకారం, వంట పూర్తయ్యాక కొంతసేపు ఇండక్షన్ స్టవ్‌ను స్టాండ్‌బై మోడ్‌లో ఉంచడం మంచిది. ఈ సమయంలో స్టవ్‌లో ఉన్న ఫ్యాన్ పనిచేసి లోపల ఏర్పడిన వేడిని తగ్గిస్తుంది. వెంటనే ఆఫ్ చేస్తే స్టవ్‌లోని సున్నితమైన భాగాలు ఎక్కువసేపు వేడిగా ఉండి దెబ్బతినే అవకాశం ఉంటుంది.
ఇండక్షన్ స్టవ్‌లో కూలింగ్ ఫ్యాన్
ఇటీవల LPG గ్యాస్ కొరత నేపథ్యంలో చాలా మంది ఇండక్షన్ స్టవ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, వాటిని సరైన విధంగా ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. వంట చేసిన వెంటనే స్టవ్‌ను పూర్తిగా ఆఫ్ చేయకూడదని కంపెనీలు సూచిస్తున్నాయి.
వాస్తవానికి ఇండక్షన్ స్టవ్‌లో ఒక కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. ఇది స్టవ్‌లో ఏర్పడే వేడిని బయటకు పంపి లోపల ఉన్న భాగాలను చల్లబరుస్తుంది. మీరు స్టవ్‌ను వెంటనే ఆఫ్ చేస్తే ఈ ప్రక్రియ పూర్తిగా జరగదు. దీంతో స్టవ్‌లోని భాగాలు వేడిగా ఉండి దెబ్బతినే అవకాశం ఉంటుంది.
ఆఫ్ చేయడానికి సరైన విధానం
ఇండక్షన్ స్టవ్ ఉపయోగించిన తర్వాత వెంటనే ప్లగ్ తీసేయకుండా కొంతసేపు అలాగే ఉంచాలి. వంట పూర్తయిన తర్వాత స్టవ్‌లోని ఫ్యాన్ పనిచేసి లోపల ఉన్న వేడిని బయటకు పంపుతుంది. అందుకే కొద్దిసేపు స్టవ్‌ను ప్లగ్‌లో ఉంచడం మంచిది.
వెంటనే ఆఫ్ చేస్తే కలిగే నష్టాలు
వెంటనే స్టవ్‌ను ఆఫ్ చేస్తే లోపల ఉన్న భాగాలు ఎక్కువసేపు వేడిగా ఉంటాయి. దీని వల్ల స్టవ్ పనితీరు తగ్గిపోవచ్చు, అలాగే దాని జీవితకాలం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కొంతసేపు స్టవ్‌ను ఆన్‌లో ఉంచితే ఫ్యాన్ పనిచేసి రాగి కాయిల్స్‌ను చల్లబరుస్తుంది. దీంతో స్టవ్ ఎక్కువకాలం మంచి స్థితిలో ఉంటుంది.
వెంట్లను శుభ్రంగా ఉంచడం కూడా ముఖ్యం
ఇండక్షన్ స్టవ్‌లో వేడి బయటకు వెళ్లేందుకు పక్కల భాగాల్లో, దిగువన చిన్న రంధ్రాలు (వెంట్లు) ఉంటాయి. వీటి ద్వారా ఫ్యాన్ వేడిని బయటకు పంపుతుంది. అయితే కాలక్రమేణా ఈ వెంట్లలో దుమ్ము చేరి మూసుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే కంపెనీలు ఈ వెంట్లను తరచూ శుభ్రం చేయాలని సూచిస్తున్నాయి.
Also Read:
ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం
పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి
For More Latest News