Share News

పూరి సాఫ్ట్‌గా రావాలంటే ఇలా చేయండి

ABN , Publish Date - Mar 02 , 2026 | 03:07 PM

పూరీ అంటే చాలా మందికి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్. అయితే, ఈ పూరీలు సాఫ్ట్‌గా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పూరి సాఫ్ట్‌గా రావాలంటే ఇలా చేయండి
Soft Puri Recipe

ఇంటర్నెట్ డెస్క్: పూరీలు.. చాలా మందికి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌. కానీ, ఇంట్లో చేసుకునే పూరీలు గట్టిగా వస్తాయని, చాలా మంది వీటిని బయట తినడానికి ఇష్టపడతారు. అయితే, హోటల్ స్టైల్‌లో పూరీ పొంగి, సాఫ్ట్‌గా కావాలంటే ఈ చిట్కాలు ఫాలో అయిపోండి.


పూరి మెత్తగా రావడానికి చిట్కాలు:

  • గోధుమ పిండిలో 1-2 స్పూన్ల రవ్వ, చిటికెడు పంచదార, తగినంత నూనె/నెయ్యి కలిపి కొద్దిసేపు పిసకాలి.

  • పిండిని కలపడానికి గోరువెచ్చని నీరు లేదా పాలు ఉపయోగించడం వల్ల పూరి సాఫ్ట్‌గా వస్తుంది.

  • పిండిని కలిపిన తర్వాత తడి గుడ్డతో కప్పి 15-20 నిమిషాలు పక్కన పెట్టడం చాలా ముఖ్యం.

  • పూరీలను మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగా చుట్టాలి. పల్చగా ఉంటే గట్టిపడతాయి.

  • నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే వేయాలి. నూనె తక్కువ వేడిగా ఉంటే పూరీలు ఆయిల్ పీల్చుకుంటాయి.

  • పిండి గట్టిగా ఉంటే పూరీ నూనె పీల్చకుండా సాఫ్ట్‌గా వస్తుంది.

  • ఈ జాగ్రత్తలు పాటిస్తే పూరీలు బెలూన్ లా పొంగుతూ మెత్తగా వస్తాయి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి

కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?

For More Latest News

Updated Date - Mar 02 , 2026 | 03:07 PM