Share News

జుట్టు రాలడం తగ్గాలంటే ఈ నేచురల్ టిప్ ట్రై చేయండి

ABN , Publish Date - May 05 , 2026 | 10:15 AM

సాధారణంగా కొబ్బరి చిప్పను పనికిరాదని పారేస్తాం. కానీ దాన్ని కాల్చిన తర్వాత వచ్చే బూడిద జుట్టు సంరక్షణలో ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఈ కొబ్బరి చిప్ప బూడిద జుట్టుకు ఎలా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టు రాలడం తగ్గాలంటే ఈ నేచురల్ టిప్ ట్రై చేయండి
Coconut Shell Charcoal Benefits for Hair

ఇంటర్నెట్ డెస్క్: కొబ్బరి చిప్పతో గిన్నెలు, అలంకార వస్తువులు తయారు చేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ చిప్పను కాల్చిన తర్వాత వచ్చే బూడిద కూడా ఉపయోగకరమని చాలా మందికి తెలియదు. కొబ్బరి చిప్ప బూడిద జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.


సహజమైన షాంపూ

కెమికల్ షాంపూలకు బదులుగా కొబ్బరి చిప్ప బూడిదను ఉపయోగించవచ్చు. మీరు వాడే షాంపూలో కొద్దిగా ఈ బూడిద కలిపి తలస్నానం చేస్తే జుట్టు బాగా శుభ్రపడుతుంది. అలాగే జుట్టు రాలడం తగ్గి, ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

స్కాల్ప్ క్లీనింగ్ స్క్రబ్

రెండు స్పూన్ల కొబ్బరి చిప్ప బూడిదను కొబ్బరి నూనెతో కలిపి స్కాల్ప్‌కు మృదువుగా రుద్దాలి. ఇది తలలో పేరుకుపోయిన మలినాలను తొలగించి, అదనపు నూనెను తగ్గిస్తుంది. దీంతో జుట్టు తాజాగా, తేలికగా అనిపిస్తుంది.


సహజ హెయిర్ మాస్క్

ఒక గ్లాస్ నీటిలో అర చెంచా బేకింగ్ సోడా, అర చెంచా కొబ్బరి చిప్ప బూడిద కలిపి మిశ్రమం తయారు చేయాలి. దీన్ని తలకు పట్టించి కొద్దిసేపు ఉంచి కడిగేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. ఇది చుండ్రు, జుట్టు రాలడం తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ముఖ్యంగా:

  • ఈ చిట్కాలు క్రమం తప్పకుండా వాడితేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

  • ఎక్కువగా వాడకుండా మితంగా ఉపయోగించాలి.

  • సున్నితమైన చర్మం ఉన్నవారు ముందు చిన్న భాగంలో పరీక్షించి వాడాలి.

కొబ్బరి చిప్ప బూడిద సహజమైన విధంగా జుట్టును శుభ్రపరచి, బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. సరైన విధంగా వాడితే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..

ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..

For More Latest News

Updated Date - May 05 , 2026 | 10:24 AM