Share News

చాణక్య నీతి.. ఈ మూడు రకాల వ్యక్తులకు సాయం చేసే విషయంలో జాగ్రత్త

ABN , Publish Date - Oct 25 , 2026 | 07:46 PM

ఇతరులకు సాయం చేయడం మంచి లక్షణం. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం మానవత్వానికి నిదర్శనం. అయితే మనం చేసే సాయాన్ని కొందరు సద్వినియోగం చేసుకుంటే, మరికొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.

చాణక్య నీతి.. ఈ మూడు రకాల వ్యక్తులకు సాయం చేసే విషయంలో జాగ్రత్త
Chanakya Niti

ఇంటర్నెట్ డెస్క్: ఇతరులకు సాయం చేయడం మంచి లక్షణం. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం మానవత్వానికి నిదర్శనం. అయితే మనం చేసే సాయాన్ని కొందరు సద్వినియోగం చేసుకుంటే, మరికొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి, ఎలాంటి సాయం చేయాలనే విషయంలో విచక్షణ అవసరమని ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాలు సూచిస్తున్నాయి.


అర్థం చేసుకోని వ్యక్తులు

విషయాలను అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపకుండా, ఎప్పుడూ తమ వాదనకే కట్టుబడి ఉండే వ్యక్తులకు ఎంత చెప్పినా ప్రయోజనం ఉండకపోవచ్చు. అలాంటి వారికి పదేపదే సలహాలు ఇవ్వడం వల్ల సమయం, శ్రమ వృథా. ఎదుటివారు చెప్పే మంచి మాటలను స్వీకరించే మనస్తత్వం ఉన్న వారికే సలహాలు, సూచనలు ఇవ్వాలి.

అత్యాశ కలిగిన వ్యక్తులు

అవసరాలకు మించి ఆశపడేవారు తమ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తారు. ఇతరులను తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వారికి సాయం చేసే ముందు వారి ఉద్దేశాలను అర్థం చేసుకోవడం మంచిదని చాణక్య నీతి చెబుతోంది.


స్వార్థపరులు

తమ అవసరాలు తీరినంతవరకే ఇతరులతో సంబంధాలు కొనసాగించే వ్యక్తులు కొందరు ఉంటారు. పని ఉన్నప్పుడు దగ్గరవుతూ, అవసరం తీరిన తర్వాత దూరమయ్యే స్వభావం వారిలో కనిపిస్తుంది. అలాంటి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు బోధిస్తున్నారు.

ఇతరులకు సాయం చేయకూడదనేది ఈ నీతి సూత్రాల ఉద్దేశం కాదు. మన మంచితనాన్ని ఇతరులు దుర్వినియోగం చేయకుండా చూసుకోవాలని చాణక్యుడు సూచించారు. సాయం చేసే ముందు ఎదుటివారి పరిస్థితిని, అవసరాన్ని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిదని చెప్పారు.

Updated Date - Oct 25 , 2026 | 07:52 PM