Share News

చాణక్య నీతి.. పగటిపూట నిద్రపోతే ఈ నష్టాలు తప్పవు!

ABN , Publish Date - Nov 19 , 2026 | 09:02 AM

మిట్టమధ్యాహ్నం నిద్రేంటి? అని పెద్దలు తిడుతూ ఉంటారు. అలాంటి నిద్ర మంచిది కాదని వారు హెచ్చరిస్తారు. అయితే ఇదే మాట చాణక్య నీతి కూడా చెబుతోంది.

చాణక్య నీతి.. పగటిపూట నిద్రపోతే ఈ నష్టాలు తప్పవు!

ఇంటర్నెట్ డెస్క్: మిట్టమధ్యాహ్నం నిద్రేంటి? అని పెద్దలు తిడుతూ ఉంటారు. అలాంటి నిద్ర మంచిది కాదని వారు హెచ్చరిస్తారు. అయితే ఇదే మాట చాణక్య నీతి కూడా చెబుతోంది. పగటిపూట కునుకు తీస్తే పలు సమస్యలు ఎదుర్కోవాలని వివరిస్తోంది. అందుకే నిద్రమత్తును నియంత్రించాలని సూచిస్తోంది. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఆ నాలుగు నష్టాలేంటో తెలుసుకుందాం రండి.


సమయం వృథా

ఆచార్య చాణక్యుడి ప్రకారం ఒకరి జీవితంలో అత్యంత విలువైనది సమయం మాత్రమే. ఇది ఒక్కసారి గడిచిపోతే తిరిగి రాదు. కాబట్టి అందరూ ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన బోధించారు. మధ్యాహ్నం అనవసరంగా నిద్రపోవడం వల్ల సమయం వృథా అవుతుందని, పనులు అసంపూర్తిగా నిలిచిపోతాయని వివరించారు. పగటిపూట ఎక్కువగా నిద్రించే వ్యక్తిలో బద్ధకం పెరిగిపోతుంది, నిర్లక్ష్యం ఎక్కువవుతుంది. అందుకే అనారోగ్యంగా ఉన్నప్పుడు మినహా వేరే సమయంలో మధ్యాహ్నం నిద్రకు స్వస్తి చెప్పాలని చాణక్య నీతి ఉపదేశిస్తోంది.

జీర్ణ సంబంధిత సమస్యలు

పగటిపూట నిద్ర వల్ల ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుందని ఆచార్య చాణక్యుడు తెలిపారు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని వివరించారు. అజీర్ణం, గ్యాస్ లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలని చెప్పారు. అప్పుడే భోజనం చేసి మధ్యాహ్నం పడుకుంటే ఇలాంటి సమస్యలు రావచ్చు.


ఆయుష్షుపై ప్రభావం

చాణక్య నీతి ప్రకారం పగటి నిద్ర.. జీవితాన్ని క్షీణించేలా చేస్తుంది. ఆయుష్షును తగ్గిస్తుంది. అయితే పగటిపూట నిద్రపోవడం వల్ల ఒక వ్యక్తి ఆయుర్దాయంపై ప్రభావం పడుతుందని నిరూపించే ఆధారాలు లేవు.

శక్తి తగ్గపోవడం

మధ్యాహ్న నిద్ర వల్ల శరీరంలో శక్తి తగ్గిపోతుందని, రోజంతా నీరసంగా అనిపిస్తుందని ఆచార్య చాణక్యుడి బోధనలు చెబుతున్నాయి. రోజు పగలు నిద్రపోయే వారు సోమరులుగా మారుతారని హెచ్చరిస్తున్నాయి. క్రమంగా ఉత్సాహం నశిస్తుందని అంటున్నాయి.

చాణక్య నీతికి సంబంధించిన మరిన్ని కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: పై సమాచారమంతా చాణక్య నీతి భావనలపై ఆధారపడి ఉంది. ఈ కథనంలోని అంశాలను ఆంధ్రజ్యోతి సంస్థ ధ్రువీకరించడం లేదు.


ఇవీ చదవండి

ఈ చాణక్య నీతి సూత్రలతో అత్తాకోడళ్ల మధ్య గొడవలు మాయం

చాణక్య నీతి.. ఈ నాలుగు విషయాల్లో అహంకారం ఉంటే..

Updated Date - Nov 19 , 2026 | 09:05 AM