Share News

బిర్యానీ ఆకు.. సహజమైన హెయిర్ కండీషనర్‌గా ఉపయోగపడుతుందా?

ABN , Publish Date - Jul 27 , 2026 | 07:41 PM

జుట్టు రాలడం, చుండ్రు, తల చర్మం దురద వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. అయితే వంటింట్లో సులభంగా దొరికే బిర్యానీ ఆకుతో ఈ సమస్యలను కొంతవరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బిర్యానీ ఆకు.. సహజమైన హెయిర్ కండీషనర్‌గా ఉపయోగపడుతుందా?
Bay Leaves for Hair

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే చాలా మంది జుట్టు రాలడం, చుండ్రు, తల చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటికి మార్కెట్లో అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని సహజసిద్ధమైన ఇంటి చిట్కాలు కూడా మంచి ఫలితాలు ఇవ్వొచ్చు. అలాంటి వాటిలో బిర్యానీ ఆకు ఒకటి.


బిర్యానీ ఆకు కేవలం వంటల్లోనే కాదు, జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

బిర్యానీ ఆకుతో హెయిర్ మాస్క్

5 నుంచి 7 బిర్యానీ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత వాటిని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో ఒక చెంచా వేప నూనె, రెండు చెంచాల కలబంద (అలోవెరా) జెల్‌, కొద్దిగా ఉసిరి పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని తల చర్మానికి, జుట్టుకు బాగా పట్టించి 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలి. అనంతరం మెల్లగా మసాజ్ చేసి షాంపూతో తలస్నానం చేయాలి.

దురద, చుండ్రు తగ్గాలంటే..

నాలుగు లేదా ఐదు బిర్యానీ ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిలో ఒక చెంచా కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే తల చర్మం తేమగా ఉండటంతో పాటు దురద, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది.


సహజమైన హెయిర్ కండీషనర్‌గా కూడా...

ఒక గిన్నె నీటిలో బిర్యానీ ఆకులు వేసి నీరు సగానికి తగ్గే వరకు మరిగించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు చివరిగా పోయాలి. ఇది సహజమైన హెయిర్ కండీషనర్‌లా పనిచేసి జుట్టుకు మెరుపు తీసుకురావడంలో సహాయపడుతుంది.

కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి

కొబ్బరి నూనెతో తల చర్మానికి మృదువుగా మసాజ్ చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడటానికి, తేమ నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. అలాగే తల చర్మం పొడిబారడం కూడా తగ్గుతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్‌ చిట్కాలతో సమస్యకు చెక్‌

దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు

Updated Date - Jul 27 , 2026 | 07:42 PM