Share News

అబ్బాయిలు అస్సలు తట్టుకోలేని అమ్మాయిల 5 అలవాట్లు

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:00 PM

అమ్మాయిల అలవాట్లు కొన్ని అబ్బాయిలను ఇబ్బంది పెట్టవచ్చు. అవి కొంతకాలం తర్వాత సంబంధంలో దూరాన్ని తేవచ్చు. అబ్బాయిలు ఎక్కువగా భరించలేని అమ్మాయిల ఐదు అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అబ్బాయిలు అస్సలు తట్టుకోలేని అమ్మాయిల 5 అలవాట్లు
Habits Boys Dislike

ఇంటర్నెట్ డెస్క్: కొన్ని సందర్భాల్లో, అబ్బాయిలు అస్సలు ఇష్టపడని కొన్ని అమ్మాయిల అలవాట్లు ఉంటాయి. ఇవి నిజంగా ప్రేమలో ఉండి కూడా అబ్బాయిలు తట్టుకోలేని అలవాట్లు. ఇవి ఉద్దేశపూర్వకంగా ఉండవు, కానీ అవి తరచుగా సంబంధంలో పెద్ద సమస్యల్ని తెస్తాయి.


ప్రతిదానినీ అనుమానించడం

చాలా మంది అమ్మాయిలు తరచూ అనుమానించే అలవాటు కలిగి ఉంటారు. ఫోన్ చెక్ చేయడం, స్నేహితుల గురించి ఎక్కువ అడగడం, ఇంటికి ఆలస్యంగా వస్తే ప్రశ్నలు అడగడం వంటి అలవాట్లు అబ్బాయిలను ఇబ్బంది పెడతాయి. ఇది ఎక్కువ అయినప్పుడు, వారు భరించలే స్థితికి చేరతారు.

చిన్న చిన్న విషయాలకే బాధపడటం

చిన్న చిన్న విషయాలపై ఎప్పుడూ కోపపడటం, గత తప్పులను పదే పదే గుర్తుచేయడం వంటి అలవాట్లు అబ్బాయిలను బాధపెడతాయి. ఈ అలవాటు సంబంధంలో దూరాన్ని కూడా పెంచుతుంది.


ఎప్పుడూ ఫోన్‌లో ఉండటం

ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఉంటే, అబ్బాయిలు అస్సలు ఇష్టపడరు. రిలేషన్‌లో ఒకరికొకరు సమయం కేటాయించడమే ముఖ్యం.

ఎమోషనల్ బ్లాక్‌మెయిల్

చిన్న సమస్యను పెద్ద సమస్యగా భావించి అదే పనిగా ఏడవడం లేదా చిన్న విషయం కోసం ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడం వంటి అలవాట్లు అబ్బాయిలను ఇబ్బంది పెడతాయి.

ఇతరులతో తరచుగా పోల్చడం

ఇతరులతో పోల్చడం వల్ల, అబ్బాయి తన ప్రయత్నాలకు విలువ లేదని భావించి ఆత్మవిశ్వాసం కోల్పోవచ్చు. ఇది సంబంధంలో అనవసరమైన ఒత్తిడి, అసంతృప్తిని పెంచుతుంది. అందువల్ల, అబ్బాయిలను ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం మంచిది కాది. ఇది వారిని బాధపెడుతుంది. చివరికి సంబంధంలో విభేదాలకు కారణం అవుతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?

పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

For More Latest News

Updated Date - Feb 26 , 2026 | 02:09 PM