Share News

భాగవత్‌ కార్యక్రమానికి మద్దతు ఇవ్వను

ABN , Publish Date - Aug 27 , 2026 | 06:21 AM

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ న్యూయార్క్‌లో నిర్వహించే కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వబోనని న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ అన్నారు...

భాగవత్‌ కార్యక్రమానికి మద్దతు ఇవ్వను

  • ఆరెస్సెస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా: మమ్దానీ

న్యూయార్క్‌, ఆగస్టు 26: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ న్యూయార్క్‌లో నిర్వహించే కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వబోనని న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ అన్నారు. అయితే అది ప్రైవేటు కార్యక్రమం కాబట్టి దాన్ని రద్దు చేసే పరిధి నగర యంత్రాంగానికి ఉండదని చెప్పారు. భాగవత్‌ అమెరికా పర్యటనను రద్దు చేయాలంటూ పలువురు సామాజిక కార్యకర్తలు, రాజకీయ ప్రతినిధుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. ఆర్‌ఎ్‌సఎస్‌ శతాబ్ది ఉత్సవాల ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో దాదాపు 5 వేల మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి భాగవత్‌ ప్రసంగించాల్సి ఉంది. ఈ కార్యక్రమంపై మమ్దానీ మాట్లాడుతూ.. ‘నేను న్యూయార్క్‌ చరిత్రలో తొలి భారతీయ అమెరికన్‌ మేయర్‌ను.. ఆర్‌ఎ్‌సఎ్‌సను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. భారత్‌ అంటేనే బహుళత్వాన్ని గౌరవించే సమాజం. అలానే లౌకిక గణతంత్ర దేశం. ఏ దేశంలో అయినా సరే ప్రజలను విడదీసే సంకుచిత భావజాలంపై ఆధారపడిన ఉద్యమం బలపడటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం’ అని వ్యాఖ్యానించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..

Updated Date - Aug 27 , 2026 | 06:21 AM