Share News

సీజ్ ఫైర్‌ను రష్యా లెక్క చేయట్లేదు: జెలెన్‌స్కీ

ABN , Publish Date - Oct 14 , 2026 | 07:57 AM

ఇంధన వసతులపై దాడులు జరగకుండా కుదుర్చుకున్న ఎనర్జీ సీజ్‌ఫైర్‌ను రష్యా ఉల్లంఘింస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు.

సీజ్ ఫైర్‌ను రష్యా లెక్క చేయట్లేదు: జెలెన్‌స్కీ
Russia Violating Energy ceasefire says zelenskyy

ఇంటర్నెట్ డెస్క్: ఇంధన వసతులపై దాడులు జరగకుండా కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని (ఎనర్జీ సీజ్‌ఫైర్‌) రష్యా ఉల్లంఘిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. మంగళవారం రాజధాని కీవ్‌పై జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందారని చెప్పారు. ఎనర్జీ సీజ్‌ఫైర్‌పై యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను రష్యా అధ్యక్షుడు పుతిన్ అసలేమాత్రం లెక్కచేయట్లేదని వ్యాఖ్యానించారు. మరిన్ని దాడులు జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ‘వాస్తవం ఏంటంటే తాము ఏ ఒప్పందానికీ కట్టుబడి ఉండాలని రష్యన్లు అనుకోవట్లేదు’ అని జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.


తొమ్మిది అంతస్తుల ఓ భవనంపై మిసైల్ దాడి జరిగిందని కీవ్‌ నగర మేయర్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 21 మంది గాయపడ్డారని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. తాజా దాడిలో రష్యన్లు అపార్టమెంట్ సమీపంలోని థర్మల్ ప్లాంట్‌ను టార్గెట్ చేసుకున్నారని అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఈ దాడుల గురించి పాశ్చాత్య దేశాల నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ రాకపోవడంపై కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు.


మిసైల్ దాడులకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు, నిఘా సమాచారం కోసం ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాలపైనే అధికంగా ఆధారపడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. రష్యా ముడి చమురు రంగ మౌలిక వసతులపై దాడులు ఆపకపోతే నిఘా సమాచారం పంచుకోవడాన్ని నిలిపివేస్తామని అమెరికా అధికారులు ఉక్రెయిన్‌కు వార్నింగ్ ఇచ్చినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇటీవల కాలంలో రష్యాలోని ఇంధన వసతులపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ఉధృతం చేసింది. దీనికి ప్రతిగా ఉక్రెయిన్‌లోని విద్యుత్ ప్లాంట్‌ను రష్యా టార్గెట్ చేస్తోంది. రష్యా చమురు రంగాన్ని ఉక్రెయిన్ టార్గెట్ చేయడంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయని ట్రంప్ ఆందోళనతో ఉన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

రిపబ్లికన్ల గెలుపు కోసం మస్క్‌ భారీగా ఖర్చు

నాసా–స్పేస్‌ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ISSకు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక

Updated Date - Oct 14 , 2026 | 08:11 AM