Share News

రిపబ్లికన్ల గెలుపు కోసం మస్క్‌ భారీగా ఖర్చు

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:24 AM

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేరొందిన ఎలాన్‌ మస్క్‌ అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీకి మద్దతుగా భారీగా నిధులు ఖర్చు చేస్తున్నారు.

రిపబ్లికన్ల గెలుపు కోసం మస్క్‌ భారీగా ఖర్చు
ELON MASK

  • జూలై నుంచి ఇప్పటికి రూ.2,622 కోట్ల విరాళాలు

న్యూయార్క్‌, అక్టోబరు 13: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేరొందిన ఎలాన్‌ మస్క్‌ అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీకి మద్దతుగా భారీగా నిధులు ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది జూలై నుంచి ఇప్పటి వరకు 276 మిలియన్‌ డాలర్లకు పైనే (రూ.2,622 కోట్లు) ఆయన విరాళంగా అందించారు. తద్వారా కాంగ్రె్‌సలో రిపబ్లికన్ల ఆధిపత్యాన్ని నిలబెట్టేందుకు మస్క్‌ తనవంతు సహకారం అందిస్తున్నారు. ఇందులో 158 మిలియన్‌ డాలర్లను రిపబ్లికన్‌ పార్టీ సెనేట్‌ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసే ‘సెనేట్‌ లీడర్‌షిప్‌ ఫండ్‌’కు అందించారు. అమెరికా రాజకీయ చరిత్రలో ఒక వ్యక్తి అందించిన భారీ విరాళం ఇది. 76 మిలియన్‌ డాలర్లను తన సొంత పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ అయిన ‘అమెరికా పీఏసీ’కి విరాళంగా ఇవ్వగా, మరో 10మిలియన్‌ డాలర్లను టెక్సా్‌సలో రిపబ్లికన్‌ సెనేట్‌ అభ్యర్థి కెన్‌ పాక్స్‌టన్‌కు మద్దతిచ్చే ‘లోన్‌ స్టార్‌ లిబర్టీ పీఏసీ’కి ఇచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి

వాదిస్తే నిజాలు అబద్ధాలు కావు.. లద్దాఖ్‌పై చైనాకు భారత్ కౌంటర్

హూతీలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేశాం.. సౌదీ దళాల ప్రకటన

Updated Date - Oct 14 , 2026 | 05:26 AM