Viral Video: మంచులో చిక్కుకున్న మహిళా స్కీయర్, కుక్క.. షాకింగ్ వీడియో వైరల్
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:46 PM
ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య ఉన్న చిన్న దేశమైన అండోరాలోని పైరినీస్ మంచు పర్వతాలలో ఓ మహిళ తన కక్కతో కలిసి స్కీయింగ్ చేస్తోంది.. అంతలోనే హిమపాతం రావడంతో అందులో చిక్కుకున్న భయానక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రమాదాలు అనేవి ఎప్పుడు.. ఎలా ముంచుకు వస్తాయో ఎవరూ ఊహించలేరు. ఒక మహిళ తన కుక్క(Dog)తో కలిసి స్కీయింగ్ (Skiing) చేస్తుండగా ఉన్నట్టుండి హిమ పాతం ముంచుకు వచ్చింది. ఆ సమయంలో కుక్క ప్రాణాలకు తెగించి యజమానురాలి కోసం చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య ఉన్న చిన్న దేశమైన అండోరా(Andorra)లో ఒక మహిళా స్కీయర్ తన పెంపుడు కుక్కతో కలిసి స్కీయింగ్ చేస్తోంది. అకస్మాత్తుగా పర్వతం పైనుంచి హిమపాతం(Avalanche) సంభవించడంతో, ఆ మహిళ, శునకం మంచు కింద చిక్కుకుపోయారు.ఆ సమయంలో సదరు మహిళ తన కుక్కను మాసీప్ అని అరుస్తూ.. ప్రమాదానికి దూరంగా వెళ్లూ అని చెబుతోంది.
కొన్ని క్షణాల ఉత్కంఠభరితమైన పరిస్థితి తర్వాత హిమపాతం(Snowfall) ఆగిపోయింది. తన యజమానురాలి వద్దకు వచ్చిన కుక్క గోళ్లతో మంచును రక్కుతూ ఆమె గురించి ఎంతో తాపత్రయ పడినట్లు వీడియోలో కనిపిస్తుంది. భయంకరమైన హిమ పాతం నుంచి ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంత ప్రమాదకర పరిస్థితిలోనూ కుక్క తన యజమానురాలి గురించి వెతుక్కోవడం చూసి శునకం గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
విజయ్ జననాయగన్ వాయిదాపై రాహుల్ ట్వీట్.. మోదీపై విమర్శలు
భూతల దాడులకు కూడా సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి