హోర్ముజ్‌ను దాటిన అమెరికా యుద్ధ నౌకలు
ABN , Publish Date - Apr 11 , 2026 | 10:30 PM
పాక్ వేదికగా యూఎస్-ఇరాన్ చర్చలు జరుగుతున్న వేళ రెండు అమెరికన్ యుద్ధ నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధి మీదుగా సరకు రవాణా నౌకలకు మార్గం సుగమం చేస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్టు చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటినట్టు సమాచారం. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు రెండు ఎలాంటి ఆటంకాలు లేకుండా హోర్ముజ్‌ను దాటాయని యూఎస్ అధికారులు చెప్పినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ అధికారులతో నిమిత్తం లేకుండానే నౌకలు హోర్ముజ్‌ను దాటాయని తెలుస్తోంది.
హోర్ముజ్‌ను క్లియర్ చేస్తున్నామంటూ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో నేడు పోస్టు చేశారు. చైనా, జపాన్ లాంటి దేశాలకు తాను ఉపకారం చేస్తున్నానని కూడా చెప్పుకొచ్చారు. తమ పని తాము చేసుకునే ధైర్యం, కోరిక వాటికి లేవని కూడా అన్నారు.
ఫిబ్రవరి 28న అమెరికా దాడులు ప్రారంభమైన నాటి నుంచీ హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసిన విషయం తెలిసిందే. సముద్ర జలాల్లో సీమైన్స్ ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరిన నేపథ్యంలో జలసంధి మీదుగా రాకపోకలు మొదలయ్యాయి. ఇక పాక్ వేదికగా నేడు యూఎస్, ఇరాన్‌ల మధ్య చర్చలు ప్రారంభం అయ్యాయి. ఇవి ఏ మలుపు తిరుగుతాయో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తేసే యోచనలో యూఎస్!
చర్చలు మొదలు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్