విద్యార్థితో లేడీ టీచర్ పాడు పని.. వీడియో వైరల్ అవ్వటంతో..
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:12 PM
విద్యా బుద్ధులు నేర్పి పిల్లలను సక్రమ మార్గంలో పెట్టాల్సిన టీచర్ గాడితప్పింది. ఓ విద్యార్థితో తప్పుగా ప్రవర్తించింది. రెండు సార్లు అతడిపై లైంగిక దాడికి పాల్పడింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
న్యూయార్క్, జూన్ 23: విద్యా బుద్ధులు నేర్పి పిల్లలను సక్రమ మార్గంలో పెట్టాల్సిన టీచర్ గాడితప్పింది. ఓ విద్యార్థితో తప్పుగా ప్రవర్తించింది. రెండు సార్లు అతడిపై లైంగిక దాడికి పాల్పడింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్జియాకు చెందిన 25 ఏళ్ల మారిస్ నికోల్స్ అలెగ్జాండర్ హై స్కూల్‌లో బయోలజీ టీచర్‌గా పని చేస్తోంది. ఆమె ఆ స్కూల్‌లో చదివే ఓ విద్యార్థితో సంబంధం పెట్టుకుంది. గత ఏప్రిల్ 23వ తేదీన విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడింది.
మే 2వ తేదీన కూడా విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఓన్లీ ఫ్యాన్స్’ అకౌంట్‌లో షేర్ చేసింది. మారిస్ ఓన్లీ ఫ్యాన్స్ అకౌంట్ గురించి ఓ విద్యార్థికి తెలిసింది. ఆ విద్యార్థి మిగిలిన వారికి చెప్పాడు. ఆ అకౌంట్‌ను పావుగా వాడుకుని కొంతమంది విద్యార్థులు మారిస్‌ను బ్లాక్ మెయిల్ చేయటం మొదలెట్టారు. పరీక్షల్లో మంచి మార్కులు వేయకపోతే ఆ అకౌంట్ సంగతి అందరికీ చెప్పేస్తామని బెదిరించారు. ఈ నేపథ్యంలోనే మారిస్ ఓ విద్యార్థిని లైంగికంగా వేధించిన సంగతి పోలీసుల దృష్టికి వెళ్లింది.
పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు కండీషన్ బెయిల్ మంజూర్ చేసింది. కూతురిని తప్ప ఏ ఇతర మైనర్లను కలవకూడదని తేల్చి చెప్పింది. తాజాగా, మారిస్ కోర్టులో ఓ పిటిషన్ వేసింది. 17 ఏళ్ల తన సోదరుడిని కలవటానికి అవకాశం ఇవ్వాలని కోరింది. కోర్టు ఆమె పిటిషన్‌పై సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో భారీ ట్రేడ్.. ఢిల్లీకి పంత్, లఖ్‌నవూకు కుల్‌దీప్ యాదవ్
గుడ్లతో ఈ ఆహారాలు తింటే సమస్యలే!