ఇరాన్ సబ్‌మెరైన్ మరమ్మతుల కేంద్రంపై యూఎస్ దాడి
ABN , Publish Date - Jul 13 , 2026 | 10:13 PM
ఇరాన్‌లోని సబ్‌మెరైన్, యుద్ధ నౌకల మరమ్మతుల కేంద్రంపై అమెరికా దాడి చేసింది. పలు సముద్రపు డ్రోన్‌లతో ఈ దాడి చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లోని సబ్‌మెరైన్, యుద్ధ నౌకల మరమ్మతుల కేంద్రంపై అమెరికా దాడి చేసింది. పలు సముద్రపు డ్రోన్‌లతో ఈ దాడి చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. బందర్ అబ్బాస్ పోర్టు వద్ద ఆదివారం ఈ దాడి చేశామని పేర్కొంది. మానవ రహిత డ్రోన్స్‌తో అమెరికా ఈ దాడులు నిర్వహించింది. సముద్రపు డ్రోన్స్‌ను అమెరికా వినియోగించడం ఇదే తొలిసారి.
ఈ దాడుల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ హోర్ముజ్ జలసంధిని తమ హస్తగతం చేసుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఇరాన్‌లోని పలు స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. ఇందుకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై దాడులను కొనసాగిస్తోంది. హార్ముజ్ విషయంలో కూడా ఇరు దేశాలు భిన్న ప్రకటనలు చేస్తున్నాయి. హార్ముజ్‌ను మూసేశామని ఇరాన్ ప్రకటించగా ఆ జలసంధి తెరిచే ఉందని అమెరికా పేర్కొంది. ఇక సోమవారం ఇరాన్‌పై జరిగిన దాడుల్లో ఇద్దరు మరణించారు. హోర్ముజ్‌ను దాటేందుకు ప్రయత్నించిన రెండు నౌకలను హెచ్చరిస్తూ ఇరాన్ గాల్లోకి కాల్పులు జరిపినట్టు కూడా స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆదివారం ఒక కంటెయినర్ షిప్‌ను ఇరాన్ టార్గెట్ చేయడంతో అమెరికా కూడా ప్రతిదాడులకు దిగింది.
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్‌తో అవగాహన ఒప్పందాన్ని పక్కన పెట్టేసిన ఇరాన్
ఇరాన్ సైనిక దళం ఐఆర్‌జీసీతో దేశభద్రతకు ముప్పు: యూకే