హోర్ముజ్ సమీపంలో కూలిన యూఎస్ ఆర్మీ హెలికాఫ్టర్
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:24 PM
యూఎస్ ఆర్మీకి చెందిన ఒక అపాచీ హెలికాప్టర్ హోర్ముజ్ జలసంధికి సమీపంలో ఇటీవల కూలిపోయింది. పైలట్లు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఆర్మీకి చెందిన ఒక అపాచీ హెలికాప్టర్ హోర్ముజ్ జలసంధికి సమీపంలో కూలిపోయింది. హెలికాప్టర్‌లోని ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఇరాన్ దాడితో అపాచీ కూలిపోయిందా? లేక మరేదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇజ్రాయెల్, ఇరాన్‌లు పరస్పర దాడులకు దిగిన రోజే హెలికాప్టర్ కూలినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. హెలికాప్టర్ కూలిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ధ్రువీకరించారు. పైలట్లు క్షేమంగానే ఉన్నారని అన్నారు.
హోర్ముజ్‌లో ఇరాన్ దూకుడును కట్టడి చేసేందుకు అపాచీ హెలికాప్టర్‌లతో పాటు రీపర్ డ్రోన్లు, ఎఫ్/ఏ-18, ఎఫ్-35 ఫైటర్ జెట్స్‌ను యూఎస్ వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకూ 42 రెండు మిలిటరీ విహంగాలను యూఎస్ కోల్పోయినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే, అపాచీ హెలికాప్టర్‌ను కోల్పోవడం మాత్రం ఇదే తొలిసారని తెలుస్తోంది.
ప్రపంచంలోని అత్యాధునిక మిలిటరీ హెలికాప్టర్‌లలో అపాచీ కూడా ఒకటి. హెల్‌ఫైర్ మిసైల్స్‌తో ఇది శత్రుమూకలను టార్గెట్ చేస్తుంటుంది. యుద్ధ ట్యాంకులను కూడా ఈ మిసైల్స్ ధ్వంసం చేయగలవు. శత్రుదేశ దాడులను తట్టుకునేలా గట్టి కవచం కూడా ఈ హెలికాప్టర్‌లో ఉంటుంది. హోర్ముజ్‌లో డ్రోన్స్, ఇతర చిన్న బోట్లను టార్గెట్ చేసేందుకు యూఎస్ అపాచీ హెలికాప్టర్‌లను వినియోగిస్తోంది.
హాలీవుడ్ సినిమాను తలపించే క్రైమ్ స్టోరీ.. 37 ఏళ్ల మహిళ 12 ఏళ్ల బాలికలా..
నువ్వు ఒంటరి అయిపోతావ్.. నెతన్యాహుకు ట్రంప్ వార్నింగ్