Share News

హోర్ముజ్‌లో జరిగే ప్రతిదాడికి బదులుగా ఒక పవర్‌ప్లాంట్‌పై దాడి: ట్రంప్

ABN , Publish Date - Jul 22 , 2026 | 10:19 PM

గత కొన్ని రోజులుగా ఇరాన్‌పై అమెరికా వరుసగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో వార్నింగ్ ఇచ్చారు. హోర్ముజ్‌లో నౌకలపై జరిగే ప్రతి దాడికి బదులుగా ఇరాన్‌లోని పవర్ ప్లాంట్‌ లేదా వంతెనపై దాడులు చేస్తామని హెచ్చరించారు.

హోర్ముజ్‌లో జరిగే ప్రతిదాడికి బదులుగా ఒక పవర్‌ప్లాంట్‌పై దాడి: ట్రంప్
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా ఇరాన్‌పై అమెరికా వరుసగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో వార్నింగ్ ఇచ్చారు. హోర్ముజ్‌లో నౌకలపై జరిగే ప్రతి దాడికి బదులుగా ఇరాన్‌లోని పవర్ ప్లాంట్‌ లేదా వంతెనపై దాడులు చేస్తామని హెచ్చరించారు. మంగళవారం రాత్రి కూడా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్‌పై దాడులు చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ హెచ్చరిక చేశారు. మంగళవారం రాత్రి 75 నిమిషాల పాటు దాడులు కొనసాగాయని యూఎస్ సెంట్రల్‌కమాండ్ పేర్కొంది. గల్ఫ్ దేశాల్లోని భద్రతా వ్యవహారాలను అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ విభాగం పర్యవేక్షిస్తోంది.


మంగళవారం రాత్రి తాము ఇరాన్‌లోని మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. డ్రోన్ నిల్వ కేంద్రాలు, మిలిటరీ లాజిస్టిక్స్‌కు సంబంధించి మౌలిక వసతులను ధ్వంసం చేశామని పేర్కొంది. ఇటీవల కాలంలో అమెరికా జరిపిన దాడుల్లో 50 మంది పౌరులు మరణించారని ఇరాన్ పేర్కొంది. మరో 500 మంది గాయపడ్డారని తెలిపింది. మరోవైపు, ఈ ఘర్షణల్లో మృతి చెందిన అమెరికా సైనిక సిబ్బంది సంఖ్య 18కు పెరిగింది. ఇప్పటివరకూ దాదాపు 30 సరకు రవాణా నౌకలపై ఇరాన్ దాడి చేసిందని అమెరికా ఆరోపిస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

గల్ఫ్ యుద్ధంలో మధ్యవర్తిత్వం చేశాం.. ఇప్పుడు సాయం చేయండి: పాక్

పిక్‌యాక్స్ అణుకేంద్రంపై దాడి చేస్తామన్న యూఎస్! ఇది సాధ్యమేనా?

Updated Date - Jul 22 , 2026 | 10:29 PM