Share News

గల్ఫ్ యుద్ధంలో మధ్యవర్తిత్వం చేశాం.. ఇప్పుడు సాయం చేయండి: పాక్

ABN , Publish Date - Jul 22 , 2026 | 09:11 PM

గల్ఫ్ యుద్ధం సందర్భంగా మధ్యవర్తిత్వం జరిపినందుకు తమను ఆదుకోవాలని పాక్ యూఎస్‌ను తాజాగా అభ్యర్థించింది. 10 బిలియన్ డాలర్ల విలువైన ఎక్సేంజ్ స్టెబిలైజేషన్ సపోర్టు ఫెసిలిటీ సౌకర్యాన్ని కోరింది.

గల్ఫ్ యుద్ధంలో మధ్యవర్తిత్వం చేశాం.. ఇప్పుడు సాయం చేయండి: పాక్
Pak Seeks Currency Stabilization Facility From US

ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్ యుద్ధం తొలగిపోయేందుకు మధ్యవర్తిత్వం జరిపినందుకు తమను ఆదుకోవాలని పాక్ యూఎస్‌ను తాజాగా అభ్యర్థించింది. 10 బిలియన్ డాలర్ల విలువైన ఎక్సేంజ్ స్టెబిలైజేషన్ సపోర్టు ఫెసిలిటీ సౌకర్యాన్ని కోరింది. విదేశీ మారకం నిల్వలు అంతకంతకూ తరిగిపోతున్న నేపథ్యంలో తమ మధ్యవర్తిత్వ సేవలను గుర్తిస్తూ సాయం అందించాలని పాక్ యూఎస్‌ను తాజాగా కోరినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. యూఎస్ ట్రెజరీ సెక్రటరీని పాక్ ఈ మేరకు అభ్యర్థించినట్టు సమాచారం.

ఐఎమ్ఎఫ్ సాయం అందుతున్నప్పటికీ పాక్‌లో ఆర్థికంగా గడ్డుపరిస్థితులు కొనసాగుతున్నాయి. ఐఎమ్‌ఎఫ్‌తో పాటు చైనా, సౌదీ అరేబియా కూడా పాక్‌కు సాయం అందిస్తున్నాయి. పాక్‌లో ప్రస్తుతం విదేశీ మారకం నిల్వలు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో పాక్ కరెన్సీ విలువ మరింత పడిపోకుండా, దిగుమతులకు ఆటంకాలు ఏర్పడకుండా పాక్ యూఎస్ సాయాన్ని అర్థించింది.


ఏమిటీ ఎక్సేంజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీ

ఒక దేశ కరెన్సీ మారకం విలువను స్థిరీకరించేందుకు అమెరికా ఈ సదుపాయం కల్పిస్తుంది. నేరుగా డాలర్లను సమకూర్చడంతో పాటు, కరెన్సీ స్వాప్ ఏర్పాట్లు, గ్యారెంటీల ద్వారా ఇతర దేశాల కరెన్సీ విలువ మరింత పతనం కాకుండా సాయం చేస్తుంది. ఒక 2026 చివరి నాటికి పాక్‌లో విదేశీ మారకం 20 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అక్కడి కేంద్ర బ్యాంకు అంచనా వేస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

పిక్‌యాక్స్ అణుకేంద్రంపై దాడి చేస్తామన్న యూఎస్! ఇది సాధ్యమేనా?

ఇరాన్ యుద్ధం.. అమెరికా ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా..

Updated Date - Jul 22 , 2026 | 09:53 PM