Share News

ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తా..

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:54 AM

ఇరాన్‌లో ఇంకా మిగిలినదేమైనా ఉంటే పూర్తిగా నాశనం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు.

ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తా..

  • ‘హోర్ముజ్‌’ బాధ్యతను ఆ జలసంధిని వాడుకునే దేశాలకే అప్పగిస్తా: ట్రంప్‌

వాషింగ్టన్‌, మార్చి 18: ఇరాన్‌లో ఇంకా మిగిలినదేమైనా ఉంటే పూర్తిగా నాశనం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. హోర్ముజ్‌ జలసంధి బాధ్యతలను దానిని వాడుకునే దేశాలకే అప్పగిస్తానన్నారు. ఈ అంశంలో ఇప్పటివరకు స్పందించని మిత్రదేశాలు.. తాను అలా చేస్తే వెంటనే ముందుకొస్తాయని వ్యాఖ్యానించారు. హోర్ముజ్‌ జలసంధిని తెరిచి, భద్రత కల్పించేందుకు యుద్ధ నౌకలను పంపాలన్న ట్రంప్‌ విజ్ఞప్తిని నాటో కూటమి, ఇతర దేశాలు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రంగా ఆగ్రహించిన ట్రంప్‌.. తమకు ఎవరూ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై బుధవారం ట్రూత్‌ సోషల్‌లో పలు పోస్టులు పెట్టారు. నాటో దేశాలను ఉద్దేశిస్తూ.. ‘‘కొందరు పూర్తి మూర్ఖుల కోసం చెబుతున్నా.. ఇరాన్‌ ఉగ్రవాద దేశమని అందరూ అంగీకరిస్తున్న విషయమే. ఆ దేశం పని ముగించేదిశగా మేం వేగంగా చర్యలు చేపడుతున్నాం..’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - Mar 19 , 2026 | 06:54 AM