ట్రంప్ జలసంధి.. కాదు హోర్ముజ్.. యూఎస్ అధ్యక్షుడి కామెంట్స్
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:54 AM
హోర్ముజ్ జలసంధిని ట్రంప్ జలసంధి అంటూ అమెరికా అధ్యక్షుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యుద్ధ విరమణ ఒప్పందం కోసం ఇరాన్ అమెరికాను వేడుకుంటోందని కూడా చెప్పుకొచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిని ట్రంప్ జలసంధి అని పిలుస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనీషియేటివ్ సమ్మిట్‌లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ‘వాళ్లు ట్రంప్ జలసంధిని తెరవాల్సిందే.. అదే.. హోర్ముజ్‌ను తెరవాలి’ అని అన్నారు. సారీ.. పొరపాటు జరిగిపోయింది అని ఆ తరువాత వ్యంగ్యంగా కామెంట్ చేశారు. తన వ్యాఖ్యలపై మీడియాలో వార్తలు వస్తాయని, తాను పొరపాటున అలా అన్నానని మీడియాలో రాస్తారని కామెంట్ చేశారు. అయితే, తాను అలాంటి పొరపాట్లు ఎక్కువగా చేయనని చెప్పుకొచ్చారు.
ఇరాన్ ఒత్తిడిలో కూరుకుపోయిందని కూడా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొచ్చారు. చర్చలకు రెడీ అయ్యిందని అన్నారు. ఈ క్రమంలో ముడి చమురు నౌకలను కూడా పంపించిందని చెప్పారు. ‘వాళ్లు ఒప్పందం కోసం వేడుకుంటున్నారు’ అని కూడా ట్రంప్ కామెంట్ చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. హోర్ముజ్ జలసంధిని తెరవడం ఈ ఒప్పందం అమలుకు కీలక అంశమని స్పష్టం చేశారు.
గతేడాది అధ్యక్షుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదేశాలను కూడా జారీ చేశారు. అయితే, మెక్సికో మాత్రం ఈ పేరు మార్పును తిరస్కరించింది. ఇక అమెరికా వాసులకు కనిపించే గూగుల్ మ్యాప్స్‌లో గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా సంస్థ మార్చింది. ఇతర దేశాల్లో మాత్రం మ్యాప్‌ను గూగుల్ యథాతథంగా కొనసాగించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
'సుప్రీం లీడర్ ఇక లేరు'.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మోదీ-ట్రంప్ ఫోన్ కాల్.. మధ్యలో మస్క్ ఎంట్రీ