క్రూయిజ్ నౌకను ఢీకొట్టిన ట్యాంకర్.. తప్పిన పెను ముప్పు
ABN , Publish Date - Nov 14 , 2026 | 10:14 AM
అమెరికాలో ఓ భారీ ట్యాంకర్ నౌక అదుపు తప్పి మరో క్రూయిజ్ నౌకను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఓ భారీ ట్యాంకర్ నౌక అదుపు తప్పి మరో క్రూయిజ్ నౌకను ఢీకొట్టింది. మిస్సిసిప్పీ నదిలో వెళుతున్న ట్యాంకర్ శుక్రవారం న్యూఆర్లీన్స్ పోర్టు వద్ద నిలిపి ఉంచిన క్రూయిజ్ నౌకను డీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన సమయంలో క్రూయిజ్ నౌకలో దాదాపు 180 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 32 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని న్యూఆర్లీన్స్ నగర మేయర్ తెలిపారు.
ప్రయాణికులు క్రూయిజ్ నౌక నుంచి దిగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన అత్యవసర సిబ్బంది మిగిలిన ప్రయాణికులను వేగంగా కిందకు దింపేశారు. ఆ తరువాత కాసేపటికి పడవ పూర్తిగా పక్కకు ఒరిగిపోయింది. ఇది ఓ అసాధారణమైన ఘటన అని లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీ వ్యాఖ్యానించారు. ఇంతటి ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటం అద్భుతమేనని వ్యాఖ్యానించారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, అల్లాంటిక్ ఆస్ఫాల్ట్ అనే ట్యాంకర్ మిస్సిసిప్పీ నదిపై ఓ బ్రిడ్జిని దాటిన తరువాత అదుపు తప్పి క్రూయిజ్ నౌకను ఢీకొట్టింది. మార్షల్ ఐల్యాండ్స్‌లో ట్యాంకర్ రిజిస్టర్ అయి ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు యూఎస్ కోస్ట్ గార్డు, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ బోర్డు దర్యాప్తు ప్రారంభించాయి. ప్రమాదం నేపథ్యంలో మిస్సిసిప్పీ నదిలో నౌకల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ వార్తలనూ చదవండి:
జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్
ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..