నిద్ర రావటం లేదని గేమ్ ఆడింది.. రూ. 1.4 కోట్ల లాటరీ గెలిచింది..
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:23 PM
అర్ధరాత్రి దాటినా నిద్రరావటం లేదని ఆన్‌లైన్‌లో లాటరీ గేమ్ ఆడిన ఓ యువతికి ఊహించని అదృష్టం దక్కింది. లాటరీలో ఏకంగా 1.4 కోట్ల రూపాయలు గెలిచింది. అమెరికాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇంటర్‌నెట్ డెస్క్: అర్ధరాత్రి దాటినా నిద్రరావటం లేదని ఆన్‌లైన్‌లో లాటరీ గేమ్ ఆడిన ఓ యువతికి ఊహించని అదృష్టం దక్కింది. లాటరీలో ఏకంగా 1.4 కోట్ల రూపాయలు గెలిచింది. అమెరికాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. నార్త్ కరోలినాలోని మూరెస్‌విల్లే ప్రాంతానికి చెందిన ష్యూ రోలీ జూన్ 8వ తేదీన రాత్రి నిద్రపోవటానికి ఉపక్రమించింది. ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర రాలేదు. దీంతో చేసేది ఏమీ లేక రోలీ సెల్‌ఫోన్ వాడటం మొదలెట్టింది.
ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌లో లాటరీ గేమ్ ఆడింది. 30 డాలర్లు పెట్టి గేమ్ ఆడిన ఆమెను భారీ అదృష్టం వరించింది. ఏకంగా 1.4 కోట్ల రూపాయలు ఆమె గెలుచుకుంది. జులై 13వ తేదీన లాటరీ డబ్బులు ఆమె ఖాతాలో పడ్డాయి. ప్రైజ్ మనీ 1,50,000 డాలర్లు (భారత కరెన్సీలో 1.4 కోట్ల రూపాయలు ) కాగా.. ట్యాక్స్ కటింగ్స్ పోను 1,08,023 డాలర్లు (దాదాపు కోటి రూపాయలు) రోలీకి వచ్చాయి.
ఇవి కూడా చదవండి
సీదిరి అప్పలరాజు కుమారుడి కేసు.. కాశీబుగ్గ పోలీసులపై చర్యలు