యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి మధ్యవర్తులు
ABN , Publish Date - Jul 20 , 2026 | 10:19 PM
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న వేళ ఇరు దేశాల మధ్య రాజీ ప్రయత్నాలు కుదిర్చేందుకు మధ్యవర్తులు రంగంలోకి దిగారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న వేళ ఇరు దేశాల మధ్య రాజీ ప్రయత్నాలు కుదిర్చేందుకు మధ్యవర్తులు రంగంలోకి దిగారు. దాడులకు పది రోజుల పాటు విరామం పలకాలని, శాంతిస్థాపన ఒప్పందాన్ని పునరుద్ధరించాలని మధ్యవర్తులు ఇరు దేశాలకు ప్రతిపాదించినట్టు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి. అమెరికా దాడులు కొనసాగుతున్నప్పటికీ దౌత్య ప్రయత్నాలు కూడా సాగుతున్న విషయాన్ని ఇరాన్ కూడా ధ్రువీకరించింది. ‘మధ్యవర్తులు మాకు సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతం దౌత్యప్రక్రియలు కూడా కొనసాగుతున్నాయి’ అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘే తెలిపారు.
ఇదిలా ఉంటే, సోమవారం కూడా అమెరికా ఇరాన్‌పై దాడులు కొనసాగించింది. పోర్టు నగరమైన బుషెహర్‌ను టార్గెట్ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయని ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. మరోవైపు, ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై ప్రతికార దాడులు కొనసాగించింది. బహ్రెయిన్, కువైత్ సహా పలు దేశాలను టార్గెట్ చేసింది. హోర్ముజ్ మాటున తమ దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టేసే ప్రయత్నాలు అస్సలు సహించబోమని ఇరాన్ సోమవారం తేల్చి చెప్పింది. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
హమాస్ కొత్త అధినేతగా ఖలీల్ అల్ హయ్యా ఎన్నిక.. అధికారిక ప్రకటన విడుదల!
వారి రాక కోసం ఎదురుచూస్తున్నాం: ఇరాన్ విదేశాంగ ప్రతినిధి