ఇరాన్‌కు చిక్కిన యూఎస్ ఫైటర్ జెట్ పైలట్.. మీడియాలో సంచలన కథనం
ABN , Publish Date - Apr 03 , 2026 | 06:56 PM
యూఎస్‌కు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ పైలట్ ఇరాన్‌కు చిక్కినట్టు మీడియాలో సంచలన కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై అమెరికా ఇంకా స్పందించాల్సి ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఎఫ్-35 ఫైటర్ జెట్ పైలట్ ఒకరు ఇరాన్ దళాలకు చిక్కినట్టు అక్కడి ప్రభుత్వ మీడియా శుక్రవారం సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ గగనతలంలోకి వచ్చిన ఎఫ్-35 ఫైటర్ జెట్‌పై ఇరాన్ సైనిక దళాలు దాడి చేసిన సమయంలో విమానం నుంచి ఎజెక్ట్ అయిన పైలట్ ఇరాన్ దళాలకు దొరికిపోయారని పేర్కొంది. పైలట్ తమకు దొరికిపోయారన్న ఇరాన్ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రచురించింది. పైలట్‌ను సజీవంగా పట్టుకుని తమకు అప్పగించిన వారికి ఇటీవల ఇరాన్ భారీ రివార్డును కూడా ప్రకటించింది. అయితే, ఈ వార్తలపై అమెరికా ఇంకా స్పందించాల్సి ఉంది.
అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను కూల్చేసినట్టు ఇరాన్ ఇంతకుముందే ప్రకటించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన విమానాన్ని సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థతో అడ్డుకున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలో పైలట్ కూడా ఇరాన్‌కు చిక్కినట్టు కథనాలు వెలువడటం కలకలానికి దారి తీసింది.
ఈ వార్తలనూ చదవండి:
చైనాకు చుక్కెదురు.. భారీ రాకెట్ ప్రయోగం విఫలం
భారత్‌కు బదులు చైనా.. గమ్యాన్ని మార్చుకున్న ఆయిల్ ట్యాంకర్