హోర్ముజ్‌లో భద్రత కల్పించేందుకు ఫీజు తీసుకుంటాం: ట్రంప్
ABN , Publish Date - Jul 13 , 2026 | 10:47 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. హోర్ముజ్‌లో భద్రత కల్పించే బాధ్యతను మళ్లీ తాము భుజానికెత్తుకుంటామని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. హోర్ముజ్‌లో భద్రత కల్పించే బాధ్యతను మళ్లీ తాము భుజానికెత్తుకుంటామని అన్నారు. ఇందుకయ్యే ఖర్చులో 20 శాతం ఫీజుగా తీసుకుంటామని కూడా చెప్పారు. ఇరాన్ నౌకల రాకపోకలకు బ్రేక్ పడేలా మళ్లీ దిగ్బంధనాన్ని విధిస్తున్నట్టు కూడా చెప్పారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ కామెంట్ చేశారు.
అంతకుముందు అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము హార్ముజ్‌కు సంరక్షకులుగా మారతామని చెప్పారు. ఈ క్రమంలో జలసంధిని వినియోగించే నౌకలకు రక్షణ లభించినందుకు కొంత డబ్బు చెల్లించకతప్పదని అన్నారు. అవగాహన ఒప్పందం కుదిరిన తరువాత కూడా ఇరాన్ చర్చలను సుదీర్ఘకాలం పాటు పొడిగిస్తూ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ‘నిన్న వాళ్లు దాదాపు 11 గంటల పాటు చర్చించారు. కానీ ఒప్పందంలోని ఒక్క వాక్యంపై కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు’ అని మండిపడ్డారు.
ఇక ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ వెనువెంటనే తోసి పుచ్చింది. హోర్ముజ్ నిర్వహణలో అమెరికాకు ఎలాంటి పాత్ర ఉండదని స్పష్టం చేసింది. తమ అనుమతి లేకుండా అమెరికా నౌకలు ఈ జలసంధిలోకి వస్తే దీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. అమెరికాకు ఎవరూ సహకరించకూడదని కూడా గల్ఫ్‌లోని ఇతర దేశాలను ఇరాన్ హెచ్చరించింది. ఘర్షణలు మరింత విస్తరిస్తే దానికి అమెరికా, ఇతర మిత్రదేశాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్ సబ్‌మెరైన్ మరమ్మతుల కేంద్రంపై యూఎస్ దాడి
యూఎస్‌తో అవగాహన ఒప్పందాన్ని పక్కన పెట్టేసిన ఇరాన్