Share News

ఇంధన ధరలు భారీ స్థాయిలో తగ్గుతాయి: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Sep 08 , 2026 | 08:25 AM

ఇరాన్‌పై యుద్ధంలో గెలిచాక ఇంధన ధరలు భారీగా తగ్గుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

ఇంధన ధరలు భారీ స్థాయిలో తగ్గుతాయి: డొనాల్డ్ ట్రంప్
Donald Trump on Oil Prices

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై యుద్ధంలో తాము గెలిచాక ఇంధన ధరలు భారీగా తగ్గుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గ్యాలన్‌ ధర 2 డాలర్ల దిగువకు చేరుకుంటుందని అన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఇంధన ధరలు అధికంగా ఉండటానికి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలే కారణమని చెప్పారు. పశ్చిమాసి ఉద్రిక్తతలు తొలగిపోయాక మార్కెట్లు స్థిరపడతాయని చెప్పారు.

‘ఇరాన్‌పై మేము గెలిచాక ఇంధన ధరల్లో కూడా భారీగా కోత పడుతుంది. గ్యాలన్ ఇంధన ధర 2 డాలర్ల దిగువకు చేరుకుంటుంది. ఇదంతా త్వరలోనే జరుగుతుంది. కానీ ఇరాన్‌కు అణ్వాయుధం ఎప్పటికీ దక్కదు’ అని అన్నారు.


అంతకుముందు, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గాలిబఫ్ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి దుస్సాహసాలకు దిగవద్దని తేల్చి చెప్పారు. ఇరాన్ ఇంధన వసతులను టార్గెట్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తమపై జరిగే దాడులకు ప్రతీకార దాడులు ఉంటాయన్న విషయం ఇప్పటికే రుజువైందని అన్నారు. ఇటీవల కనుమరుగైన సైనిక స్థావరాలను ఓమారు గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు. ఇరాన్‌ ఆయిల్ ట్యాంకర్‌లు ఎలాంటి రక్షణలు లేని స్థితిలో ఉన్నాయన్న అమెరికా యుద్ధ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ కామెంట్స్‌పై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ ఈ మేరకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

ఇంజిన్‌లో సమస్య.. మలేషియా విమానంకు తప్పిన పెను ప్రమాదం

హార్వర్డ్‌ యూనివర్సిటీలోని విగ్రహంలో మూడు తప్పులు! అవేంటంటే..

Updated Date - Sep 08 , 2026 | 09:03 AM