హోర్ముజ్ రక్షణ కోసం ట్రంప్ పిలుపు.. చైనా కండిషన్ ఏంటంటే..
ABN , Publish Date - Mar 16 , 2026 | 07:23 PM
హోర్ముజ్ జలసంధిని రక్షించుకునేందుకు, ఇంధన రవాణాను క్రమబద్ధీకరించేందుకు ముందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపునకు చైనా స్పందించింది.
హోర్ముజ్ జలసంధిని రక్షించుకునేందుకు, ఇంధన రవాణాను క్రమబద్ధీకరించేందుకు ముందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపునకు చైనా స్పందించింది. హోర్ముజ్ రక్షణ కోసం ముందుకు వస్తామని, అయితే ముందుగా పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని చైనా షరతు పెట్టింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఓ ప్రకటన విడుదల చేశారు (China response to Trump).
పశ్చిమాసియాలో ఘర్షణల వల్ల అంతర్జాతీయ ఇంధన ప్రవాహం, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం దెబ్బతింటున్నాయని లిన్ జియాన్ అన్నారు. ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికాకు ఆయన సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలు ఆగితేనే ప్రాంతీయ స్థిరత్వం సాధ్యమవుతుందని అన్నారు. అందుకోసం అన్ని దేశాలు కలిసి ముందుకు రావాలని సూచించారు. మార్చి నెల చివర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించాల్సి ఉంది (Strait of Hormuz security).
ప్రస్తుతం ట్రంప్ బీజింగ్ పర్యటన గురించి అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని లిన్ జియాన్ అన్నారు (Trump China Strait of Hormuz). ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో ట్రంప్ పర్యటన కీలకం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా పర్యటన గురించి ట్రంప్ తాజాగా మాట్లాడుతూ.. హోర్ముజ్ జలసంధి రక్షణ విషయంలో చైనా సమాధానాన్ని బట్టి తన పర్యటన షెడ్యూల్ ప్రకారం ఉంటుందా.. వాయిదా పడుతుందా అనే విషయంలో నిర్ణయం తీసుకుంటానన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆటో డ్రైవర్ అని తేలిగ్గా చూడకండి.. ఇతడు ఒక్క రోజులో ఎంత సంపాదిస్తాడో తెలిస్తే..
మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో జింక ఎక్కడ దాక్కుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..