విమానంలో మహిళ కలకలం.. దుస్తులు విప్పేసి..
ABN , Publish Date - Sep 15 , 2026 | 06:17 PM
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఇటీవల ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించి నానా రభసా సృష్టించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఇటీవల ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించి నానా రభసా సృష్టించింది. సెప్టెంబర్ 11న బాల్టిమోర్ నుంచి మియామీకి బయలుదేరిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి 9డీ సీటులోని ఓ మహిళ తన దుస్తులను తొలగించింది. ఇది చూసి తోటి ప్రయాణికులు షాకైపోయారు. ఆమె తోటి ప్రయాణికులతో కూడా అసభ్యంగా ప్రవర్తించడంతో వారు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. క్రూ సిబ్బంది పైలట్‌లకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మియామీ ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు.
మహిళ రభస కొనసాగుతున్నప్పటికీ విమానాన్ని మియామీకి తీసుకెళ్లేందుకే పైలట్‌లు నిర్ణయించారు. చివరకు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం రాత్రి 11.23 గంటలకు దిగాక మియామీ పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ ఎవరో? ఆమె ఎందుకు ఇలా చేసిందనే వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఘటన సమయంలో విమానంలో సుమారు 160 మంది ప్రయాణికులు ఉన్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అప్పటికే విమానం బాల్టిమోర్ నుంచి రెండు గంటల ఆలస్యంగా బయలుదేరగా ఇంతలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ వార్తలనూ చదవండి:
చైనాను వీడిన హువావే కంపెనీ సీఈఓ?
కెనడా నుంచి నలుగురు పంజాబ్ యువకుల బహిష్కరణ.. కారణం ఇదే..