Share News

చైనాను వీడిన హువావే కంపెనీ సీఈఓ?

ABN , Publish Date - Sep 15 , 2026 | 03:16 PM

చైనా టెక్ దిగ్గజం హువావే సీఈఓ రెన్ జెంగ్‌ఫీ దేశాన్ని వీడారన్న వార్త అక్కడి సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 12 నుంచే ఈ వార్త అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

చైనాను వీడిన హువావే కంపెనీ సీఈఓ?
Huwawei CEO Ren Zhengfei

ఇంటర్నెట్ డెస్క్: చైనా టెక్ దిగ్గజం హువావే సీఈఓ రెన్ జెంగ్‌ఫీ దేశాన్ని వీడారన్న వార్త అక్కడి సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 12 నుంచే ఈ వార్త అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. షెన్‌జెన్‌లోని హువావే ప్రధాన కార్యాలయం వద్ద భద్రతా బలగాలను మోహరించడంతో కలకలం పతాకస్థాయికి చేరింది. టెక్నాలజీ సంస్థల ఉన్నతోద్యోగుల విదేశీ ప్రయాణాలపై చైనా ఇటీవల కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నేటి నుంచే అవి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో హువావే సీఈఓ ఉదంతం కలకలం రేపుతోంది.


జాతీయ భద్రత, టెక్నాలజీ సంబంధిత ఎగుమతులు, కంపెనీల విషయంలో చైనా ఎగ్జిట్-ఎంట్రీ రూల్స్‌ను తీసుకొచ్చింది. ఈ అంశాలకు సంబంధించిన కేసులతో ముడిపడ్డ చైనా పౌరుల విదేశీ పర్యటనలపై ఆంక్షలు విధించింది. సెప్టెంబర్ 15 నుంచే ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హువావే సీఈఓ తన కుటుంబంతో సహా దేశాన్ని వీడారన్న వార్త వైరల్‌గా మారింది. సముద్రమార్గంలో ఆయన చైనాను వీడినట్టు సోషల్ మీడియాలో చర్చ జరగుతోంది. అయితే, ఇందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. చైనాకు చెందిన మరో టెక్ దిగ్గజం, అలీబాబా అధినేత జాక్ మా కూడా గతంలో ఇలా అదృశ్యమైన నేపథ్యంలో హువావే సీఈఓ ఆచూకీపై చర్చ పతాకస్థాయికి చేరుకుంది.


అమెరికన్ కంపెనీల ట్రేడ్ సీక్రెట్స్ తస్కరించినట్టు హువావే ఇప్పటికే యూఎస్‌లో ఆరోపణలు ఎదుర్కొంటోంది. దాదాపు 20 ఏళ్లు ఈ కుట్రను సాగించినట్టు అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. హువావేపై మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా చేశారు. ఈ కేసుల్లో విచారణ ప్రారంభం కానుంది. చైనా ప్రభుత్వం మాత్రం హువావేకు మద్దతుగా నిలుస్తోంది. చైనా కంపెనీలను అణచివేసేందుకు యూఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే టెక్ వర్కర్ల విదేశీ పర్యటనలకు సంబంధించి కొత్త రూల్స్‌ను చైనా తీసుకొచ్చింది.


ఈ వార్తలనూ చదవండి:

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ.. కారణం ఇదే..

అమెరికాలో ఘోర ప్రమాదం.. భారత సంతతి యువతి, యువకుడిపై దూసుకెళ్లిన రైలు

Updated Date - Sep 15 , 2026 | 03:28 PM