Share News

ఇరాన్‌ నీటి శుద్ధి ప్లాంట్లపై అమెరికా దాడి

ABN , Publish Date - Jun 12 , 2026 | 06:02 AM

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య సైనిక ఘర్షణ గురువారం కూడా కొనసాగింది. సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో శత్రువును అన్నిరకాలుగా కుంగదీసి...

ఇరాన్‌ నీటి శుద్ధి ప్లాంట్లపై అమెరికా దాడి

దుబాయి, జూన్‌ 11: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య సైనిక ఘర్షణ గురువారం కూడా కొనసాగింది. సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో శత్రువును అన్నిరకాలుగా కుంగదీసి కాళ్లబేరానికి తెచ్చుకొనేందుకు ఇరు దేశాలు అమానవీయ ఘటనలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో రెండు దేశాలకు నీరే ఆయుధంగా మారింది. ఇరాన్‌లో వేలమంది సామాన్య ప్రజలకు జీవనాధారమైన డీశాలినేషన్‌ (సముద్ర నీటి శుద్ధి) ప్లాంట్లను అమెరికా ధ్వంసం చేసింది. గురువారం తెల్లవారుజామున ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సహా అనేక ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సిరిక్‌ ప్రావిన్స్‌లోని రెండు డీశాలినేషన్‌ ప్లాంట్లు ధ్వంసమయ్యాయి. దీంతో 20 వేల మంది తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. అమెరికా దాడులు ఆపకపోతే కువైట్‌, ఖతార్‌, సౌదీ, యూఏఈ దేశాల డీశాలినేషన్‌ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. హోర్ముజ్‌ జలసంధిని మళ్లీ పూర్తిగా మూసివేసింది.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 06:02 AM