అమెరికా తీరుతోనే చర్చలు విఫలం
ABN , Publish Date - Apr 25 , 2026 | 05:59 AM
చర్చల సమయంలో అమెరికా తన డిమాండ్లను మార్చడంతోనే చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ (సుప్రీం లీడర్) దౌత్యవేత్త అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ ఆరోపించారు....
భారతీయులు శాంతికాముకులు
ఈ దేశంతో మా మైత్రి కొనసాగుతూనే ఉంది
ఇరాన్ దౌత్యవేత్త అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ
చర్చల సమయంలో అమెరికా తన డిమాండ్లను మార్చడంతోనే చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ (సుప్రీం లీడర్) దౌత్యవేత్త అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ ఆరోపించారు. మచిలీపట్నంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధం కారణంగా తమ దేశంలోని విద్యాలయాలు, మత సంబంధ స్థలాలు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని పునర్నిర్మించడం కొంచెం కష్టమైన పనేనన్నారు. ఇరాన్ శాంతికి సిద్ధంగానే ఉందని, అయితే దీనికి అమెరికా అనుకూలంగా లేదని పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధాన్ని, ఘర్షణ వాతావరణాన్ని కోరుకోవట్లేదని, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటోందని తెలిపారు. భారతీయులు శాంతి కాముకులని, ఈ దేశంతో తమ మైత్రి కొనసాగుతూనే ఉందని తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధాలు జరుగుతున్నప్పటికీ ఇరాన్, భారత్ మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయని చెప్పారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని, నౌకాశ్రయాల్లో వర్తక వ్యాపారాల్లో ఇరాన్‌తో భారత్‌కు ఎంతో సంబంధం ఉందని గుర్తుచేశారు. హోర్ముజ్ జలసంధిలో భారత్ జెండా ఉన్న నౌకపై ఐఆర్‌జీసీ కాల్పులు జరపడంపై స్పందిస్తూ ఇలాంటి పనులు తగవని, దీనిపై ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. అబ్దుల్ మజిద్ హకీం ఇలాహీకి స్థానిక జామియా మసీద్ వద్ద ఘనస్వాగతం లభించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News