Share News

US retaliation Syria: సిరియాపై అమెరికా ఆపరేషన్ హాక్‌ ఐ.. ఐసిస్ స్థావరాలపై ప్రతికార దాడులు..

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:20 AM

సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు చేపట్టింది. అమెరికా నిర్వహించిన ఈ భారీ దాడులు సిరియా అంతటా అనేక ఇస్లామిక్ స్టేట్ లక్ష్యాలను ఛేదించాయి. గత నెలలో ఐసిస్ చేసిన దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు, ఒక పౌరుడు మృతి చెందారు.

US retaliation Syria: సిరియాపై అమెరికా ఆపరేషన్ హాక్‌ ఐ.. ఐసిస్ స్థావరాలపై ప్రతికార దాడులు..
US retaliation Syria

సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు చేపట్టింది. అమెరికా నిర్వహించిన ఈ భారీ దాడులు సిరియా అంతటా అనేక ఇస్లామిక్ స్టేట్ లక్ష్యాలను ఛేదించాయి. గత నెలలో ఐసిస్ చేసిన దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు, ఒక పౌరుడు మృతి చెందారు. దీంతో అమెరికా వెంటనే ప్రతికార దాడులకు దిగింది. శనివారం ఆ దాడులకు కొనసాగింపును ప్రారంభించింది. ఐసిస్ ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడింది (US airstrikes ISIS).


స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించిన ఈ దాడులకు 'ఆపరేషన్ హాక్‌ ఐ' అని పేరు పెట్టారు. 2025, డిసెంబర్ 13న సిరియా, పాల్మిరాలో ఐసిస్ ఉగ్రవాదులు అమెరికా, సిరియా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులతో పాటు అమెరికాకు చెందిన ఓ ట్రాన్స్‌లేటర్ మృతి చెందాడు. యూఎస్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. డిసెంబర్ 19న ఆపరేషన్ హాక్‌ఐ పేరుతో ఐసిస్‌పై దాడులు నిర్వహించింది (Islamic State targets Syria).


ఆ సమయంలో జోర్డాన్‌తో కలిసి దాదాపు 70 ఐసిస్ స్థావరాలపై దాడులు చేసింది (US military response). తాజాగా అదే ఆపరేషన్‌కు కొనసాగింపుగా ప్రతీకార దాడులు నిర్వహించింది. దాదాపు 1000 మంది అమెరికా సైనికులు ఈ దాడుల్లో పాలు పంచుకుంటున్నట్టు సమాచారం. ఎవరైనా తమ సైనికులకు హాని తలపెడితే.. వారు చట్ట నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదని ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఓ హెచ్చరిక జారీ చేసింది.


ఇవి కూడా చదవండి..

బాబా వంగా చెప్పింది నిజమవుతుందా.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..

రిపబ్లిక్ డే సేల్‌కు రెడీ అవుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటి నుంచంటే..

Updated Date - Jan 11 , 2026 | 02:09 PM