Share News

బెంగాలీ హిందువులపై పాక్‌ సైన్యం దురాగతాలు ‘జాతి నిర్మూలనే’

ABN , Publish Date - Mar 23 , 2026 | 07:10 AM

పాకిస్థాన్‌ సైన్యం, దాని మిత్రపక్షమైన జమాత్‌-ఏ-ఇస్లామీతో కలిసి 1971లో బెంగాలీ హిందువుల ఊచకోతకు పాల్పడిందని.. దీన్ని ‘యుద్ధ నేరాలు, జాతి నిర్మూలన’గా...

బెంగాలీ హిందువులపై పాక్‌ సైన్యం దురాగతాలు ‘జాతి నిర్మూలనే’

  • అమెరికా ప్రతినిధుల సభలో సభ్యుడి తీర్మానం

వాషింగ్టన్‌, మార్చి 22: పాకిస్థాన్‌ సైన్యం, దాని మిత్రపక్షమైన జమాత్‌-ఏ-ఇస్లామీతో కలిసి 1971లో బెంగాలీ హిందువుల ఊచకోతకు పాల్పడిందని.. దీన్ని ‘యుద్ధ నేరాలు, జాతి నిర్మూలన’గా గుర్తించాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభలో కాంగ్రెస్‌ సభ్యుడు గ్రెగ్‌ ల్యాండ్స్‌మన్‌ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1971 మార్చి 25వ తేదీ రాత్రి పాక్‌ సర్కారు ముజిబుర్‌ రెహమాన్‌ను ఖైదు చేసిందని.. ఈ క్రమంలోనే ఆ దేశ సైన్యం జమాత్‌-ఏ-ఇస్లామీ సమూహాలతో కలిసి తూర్పు పాకిస్థాన్‌ అంతటా ‘ఆపరేషన్‌ సెర్చ్‌లైట్‌’ పేరుతో భారీ సంఖ్యలో బెంగాలీ హిందువులను ఊచకోత కోశారని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. దీనిపై మూడు రోజుల తర్వాత ఢాకాలోని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ ఆర్చర్‌ బ్లడ్‌ వాషింగ్టన్‌కు ‘ఓ జాతిని లక్ష్యంగా చేసుకొని నిర్మూలించడం’ శీర్షికన ఓ టెలిగ్రామ్‌ పంపగా.. అది ‘బ్లడ్‌ టెలిగ్రామ్‌’గా ప్రసిద్ధి చెందిందని అందులో వివరించారు. ఒహియోకు చెందిన డెమొక్రాట్‌ కాంగ్రెస్‌ సభ్యుడు ల్యాండ్స్‌మన్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం.. విదేశీ వ్యవహారాల శాఖకు పంపారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప

Updated Date - Mar 23 , 2026 | 07:10 AM