ఇరాన్ ఉక్కిరిబిక్కిరి
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:37 AM
అమెరికా క్షిపణి దాడులతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇంతకాలం పర్షియన్ గల్ఫ్ తీరం వెంబడి ఉన్న ఇరాన్ మిలిటరీ మౌలిక వసతులనే టార్గెట్ చేసిన అమెరికా తాజాగా ఆ దేశ ఉత్తర, తూర్పు..
దేశం నలుమూలలా అమెరికా బాంబుదాడులు
ఇరాన్ దాడులను గట్టిగా తిప్పికొడుతున్న గల్ఫ్ దేశాలు
దుబాయ్, జూలై 16: అమెరికా క్షిపణి దాడులతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇంతకాలం పర్షియన్ గల్ఫ్ తీరం వెంబడి ఉన్న ఇరాన్ మిలిటరీ మౌలిక వసతులనే టార్గెట్ చేసిన అమెరికా తాజాగా ఆ దేశ ఉత్తర, తూర్పు ప్రాంతంపైనా గురిపెట్టింది. గురువారం తెలతెలవారుతూనే ఇరాన్ నలుమూలలా భీకర దాడులు చేసింది. రాజధాని టెహ్రాన్ నగరం బాంబుల మోతతో దద్దరిల్లింది. సెమ్‌నన్, హమెదాన్, హోర్మొజ్‌గాన్, ఖుజెస్థాన్, లోరెస్థాన్, మర్కజీ, సిస్థాన్, బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లలో సైనిక, కీలక రవాణా మౌలిక వసతులే లక్ష్యంగా దాడులు జరిగాయి. మరోవైపు పశ్చిమం, దక్షిణం వైపుల్లో ఉన్న ఇరాన్ పోర్టులను పూర్తిగా దిగ్బంధించి ఆ దేశానికి నౌకా మార్గాన్ని మూసేసింది. కాగా, అహ్వాజ్ నగరంలోని షాహిద్ బఖే చిన్నపిల్లల క్యాన్సర్ ఆస్పత్రిపై అమెరికా బాంబు దాడి చేసినట్లు ఇరాన్ ఆరోపించింది. కాగా, అమెరికా దాడులకు ప్రతీకారంగా దాని మిత్ర దేశాలైన కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్ గు రువారం క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అప్రమత్తంగా ఉన్న ఆయా దేశాలు.. ఇరాన్ దాడిని సమర్థంగా తిప్పికొట్టాయి. కాగా, ఇరాన్‌తో చర్చలకు ఇంకా దారులు తెరిచే ఉన్నాయని ట్రంప్ ప్రకటించారు.
ఆ నౌకల్లో భారత నావికులను నియమించొద్దు: డీజీఎంఏ
న్యూఢిల్లీ, జూలై 16: హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దని షిప్పింగ్ కంపెనీలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (డీజీఎంఏ) ఆదేశించింది. ఈ మేరకు నౌకల యజమానులు, నిర్వాహకులు, సిబ్బంది నిర్వహణ సంస్థలకు బుధవారం అడ్వైజరీ జారీ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌పై హెచ్చరిక