ఆగని దాడులు.. ప్రతిదాడులు!
ABN , Publish Date - Jul 20 , 2026 | 06:21 AM
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. జోర్డాన్‌లోని తమ స్థావరంపై దాడి చేసి ఇద్దరు సైనికుల మృతికి కారణమైందంటూ...
ఇరాన్ తీర ప్రాంత పట్టణాలు, పోర్టులపై
వైమానిక దళంతో విరుచుకుపడిన అమెరికా
దుబాయ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ, జూలై 19: ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. జోర్డాన్‌లోని తమ స్థావరంపై దాడి చేసి ఇద్దరు సైనికుల మృతికి కారణమైందంటూ ఆదివారం తెల్లవారుజామున విరుచుకుపడింది. ఇరాన్ దక్షిణ తీర ప్రాంతం, హోర్ముజ్ జలసంధి సమీప ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది. తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, పోర్టుల్లో మౌలిక వసతులు, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలను ధ్వంసం చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ పర్వత ప్రాంతాల్లో ఉన్న కీలకమైన ది గార్డ్ స్థావరం, హోర్ముజ్‌లోని ఖేష్మ్ దీవిపైనా తోమహాక్ క్షిపణులతో దాడిచేసినట్టు తెలిపింది. ఇక ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. జోర్డాన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ తదితర దేశాల్లోని అమెరికా స్థావరాలపైకి వరుసగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. కువైట్‌లో ఆయుధ నిల్వ కేంద్రం, గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసినట్టు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. అహ్వాజ్ ప్రాంతంలో అమెరికా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను కూల్చివేశామని పేర్కొంది.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!