Share News

ట్రంప్‌కు ప్రతినిధుల సభ షాక్‌

ABN , Publish Date - Jun 05 , 2026 | 06:24 AM

ఇరాన్‌తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఆ దేశ చట్టసభ సభ్యులు షాకిచ్చారు. కాంగ్రె్‌సలోని ప్రతినిధుల సభ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో యుద్ధానికి వ్యతిరేకంగా...

ట్రంప్‌కు ప్రతినిధుల సభ షాక్‌

ఇరాన్‌తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ తీర్మానం

  • మద్దతిచ్చిన నలుగురు ట్రంప్‌ పార్టీ సభ్యులు.. సెనేట్‌ ముందుకు తీర్మానం

వాషింగ్టన్‌, జూన్‌ 4: ఇరాన్‌తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఆ దేశ చట్టసభ సభ్యులు షాకిచ్చారు. కాంగ్రె్‌సలోని ప్రతినిధుల సభ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో యుద్ధానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ సభలో అధికార రిపబ్లికన్‌ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ అఽధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందటం విశేషం. బుధవారం (స్థానిక కాలమానం) ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి నలుగురు రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు మద్దతివ్వటంతో అది నెగ్గింది. గతంలో రెండుసార్లు ఈ తీర్మానం వీగిపోయింది. అయితే, ఈ తీర్మానంతో ఇప్పటికిప్పుడు ట్రంప్‌కు వచ్చే సమస్య ఏమీ లేదు. తీర్మానం ఇప్పుడు సెనేట్‌ ముందుకు వెళ్తుంది. సెనేట్‌లోనూ రిపబ్లికన్లదే ఆధిపత్యం. అందువల్ల అక్కడ నెగ్గే అవకాశం తక్కువ. ఒకవేళ అధికార సభ్యుల మద్దతుతో నెగ్గినా.. దానిని తిరస్కరించేందుకు అధ్యక్షుడికి వీటో అఽధికారం ఉంది.

60 రోజుల్లో కాంగ్రెస్‌ ఆమోదం పొందాలి

అమెరికా కాంగ్రె్‌సలో సెనేట్‌, హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ అని రెండు సభలు ఉంటాయి. సెనేట్‌లో 100 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం ఈ సభలో రిపబ్లికన్లకు 53 మంది, డెమోక్రాట్లకు 45 మంది సభ్యులు ఉన్నారు. ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. వీరు డెమోక్రాటిక్‌ పార్టీకి మద్దతిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాల బలం 47కు పెరిగింది. ప్రతినిధుల సభలో మొత్తం 435 సీట్లు ఉండగా.. రిపబ్లికన్లకు 217, డెమోక్రాట్లకు 212 మంది సభ్యులు ఉన్నారు. ఒక స్వతంత్ర సభ్యుడు ఉండగా, అధికార పార్టీకి మద్దతిస్తున్నాడు. 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. తాజా తీర్మానానికి రిపబ్లికన్‌ సభ్యులు థామస్‌ మాసీ (కెంటకీ), టామ్‌ బారెట్‌ (మిచిగాన్‌), బ్రయాన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌ (పెన్సిల్వేనియా), వారెన్‌ డేవిడ్‌సన్‌ (ఓహియో) మద్దతు పలకటంతో అది నెగ్గింది. ‘ది వార్‌పవర్‌ యాక్ట్‌- 1973’ ప్రకారం ఏ దేశంపై అయినా యుద్ధం ప్రకటిం చే అధికారం అమెరికా కాంగ్రె్‌స కుమాత్రమే ఉంది. అధ్యక్షుడు సొంతనిర్ణయంతో యుద్ధం ప్రకటించినా 60రోజుల్లో కాంగ్రెస్‌ ఆమోదం పొందాలి.


ఒత్తిళ్లకు మోదీ లొంగడు: పుతిన్‌

మాస్కో: భారత్‌-రష్యా సంబంధాలను బలహీనపర్చేందుకు ఇతర దేశాలు భారత ప్రధాని నరేంద్రమోదీపై ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం ఉండద ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. ఎవ రి ఒత్తిళ్లకు మోదీ లొంగరని పేర్కొన్నారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ఇంటర్నేషనల్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సమావేశాల సందర్భంగా గురువారం ఆయన పలు అంతర్జాతీయ వార్తా సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. భారత్‌ తన సొంత ప్రయోజనాలపై రాజీ పడదని పేర్కొన్నారు. అమెరికాతో భారత్‌కు పెరుగుతున్న సన్నిహిత సంబంధాల వల్ల రష్యాతో భారత్‌ సంబంధాల్లో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టంచేశారు.

ఇజ్రాయెల్‌-లెబనాన్‌

కాల్పుల విరమణ

ఇరాన్‌తో అమెరికా శాంతి ఒప్పందానికి ప్రధా న ప్రతిబంధకాల్లో ఒకటిగా మారిన లెబనాన్‌ ఘర్షణకు ముగింపు పలికేందుకు ఇజ్రాయెల్‌-లెబనాన్‌ అంగీకరించాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్‌లో జరిగిన చర్చల్లో కాల్పుల విరమణకు ఈ రెండు దేశాలు అంగీకరించాయి. దక్షిణ లెబనాన్‌లో లాటినా నది దక్షిణ భాగం వరకు చొచ్చుకెళ్లిన ఇజ్రాయెల్‌ దళాలను వెనక్కి పిలిచేందుకు ఇజ్రాయెల్‌ అంగీకరించింది. నిజానికి ఇజ్రాయెల్‌ సైన్యం లెబనాన్‌తో యుద్ధం చేయటం లేదు. ఇరాన్‌ మద్దతున్న హెజ్బొల్లా సంస్థపై యుద్ధం చేస్తోంది. కానీ, తాజా కాల్పుల విరమణ ఒప్పందంలో హెజ్బొల్లాను భాగస్వామి ని చేయలేదు. దీంతో ఈ ఒప్పందాన్ని హెజ్బొల్లా తిరస్కరించింది. లెబనాన్‌ భూభాగం నుంచి ఇజ్రాయెల్‌ పూర్తిగా వైదొలిగేవరకు తాము పోరాటాన్ని ఆపబోమని హెజ్బొల్లా నేత నైమ్‌ కాసెమ్‌ ప్రకటించారు. బుధవారం ఈ ఒప్పందం కుదరగా, గురువారం ఉదయం ఇజ్రాయెల్‌ సైన్యం, హెజ్బొల్లా పరస్పరం దాడులు చేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

సూర్యకుమార్‌కు బిగ్ షాక్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

Updated Date - Jun 05 , 2026 | 06:25 AM