హెచ్-1బీ వీసాకు 2.86 లక్షల దరఖాస్తులు
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:59 AM
అమెరికా జారీచేసే హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తుదారులు పోటెత్తారు. ఈ వీసా ఫీజును ట్రంప్ ప్రభుత్వం భారీగా పెంచినప్పటికీ ఆ ప్రభావం దరఖాస్తులపై ఏమాత్రం...
వాషింగ్టన్, జూన్ 3: అమెరికా జారీచేసే హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తుదారులు పోటెత్తారు. ఈ వీసా ఫీజును ట్రంప్ ప్రభుత్వం భారీగా పెంచినప్పటికీ ఆ ప్రభావం దరఖాస్తులపై ఏమాత్రం పడలేదు. ఈ ఏడాది 2 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు లక్ష డాలర్ల రుసుము చెల్లించడానికి మొగ్గు చూపారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) తెలిపింది. ‘‘2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ హెచ్-1బీ వీసాల కోసం 2.86 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 2లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు లక్ష డాలర్లు చెల్లించారు. దీనిద్వారా వారి దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫీజు చెల్లించిన వారి దరఖాస్తులు సుమారు 15 రోజుల్లోగా ప్రాసెస్ అవుతాయి. మిగిలినవాటి ప్రాసెసింగ్‌కు దాదాపు 7.5 నెలల సమయం పడుతుంది’ అని డీహెచ్‌ఎస్ కార్యదర్శి మార్క్‌వేన్ ముల్లిన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..