ముగిసిన గడువు.. భారత్‌లో ఆయిల్ ధరలు పెరిగే అవకాశం..
ABN , Publish Date - May 18 , 2026 | 09:58 AM
రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. భారీ మూల్యం తప్పదని భారత్‌కు హెచ్చరికలు సైతం జారీ చేసింది. పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తామని స్పష్టం చేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిలో చమురు నౌకల రాకపోకలపై ఇరాన్ కఠిన ఆంక్షలు విధించింది. దీంతో చమురు సప్లైకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇండియా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని పెంచింది. రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా యుద్ధం నేపథ్యంలో ఆంక్షలను సడలించింది.
మే 17వ తేదీ వరకు రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ తేదీ వరకు ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రకటించింది. నిన్నటితో అమెరికా విధించిన గడువు ముగిసింది. ఆయిల్ నిల్వలు అంతంత మాత్రమే ఉన్న ఈ సమయంలో గడువు ముగియటం భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారనుంది. ఓ వైపు పశ్చిమాసియా నుంచి చమురు దిగుమతిలో అనిశ్చితి నెలకొంది. మరో వైపు రష్యానుంచి చమురు దిగుమతి చేసుకునే అవకాశం లేదు. ఇకపై రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకుంటే అమెరికా సుంకాల పేరుతో వేధించే అవకాశం ఉంది.
పెరగనున్న ఆయిల్ ధరలు..
దాదాపు రెండేళ్ల నుంచి రష్యా తక్కువ ధరకే భారత్‌కు ఆయిల్ అందిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా పలు దేశాలు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని ఆపేశాయి. కానీ, ఇండియా మాత్రం ఆయిల్ దిగుమతిని రెట్టింపు చేసింది. అన్ని రకాలుగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి భారత్‌కు లాభదాయకంగా మారింది. అయితే, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. భారీ మూల్యం తప్పదని భారత్‌కు హెచ్చరికలు సైతం జారీ చేసింది. పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకుంది. రష్యానుంచి ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మే 17వ తేదీ వరకు గడువు విధించింది. నిన్నటితో గడువు ముగిసింది. ఒక వేళ భారత్.. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి నిలిపి వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. దేశంలో ఆయిల్ సంక్షోభం తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం కూడా ఉంది.
ఇవి కూడా చదవండి
యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్
ఏటీఎమ్‌లో సాంకేతిక లోపం.. రూ. 100 నోటుకు బదులు రూ. 500