హెచ్-1బీ అవకతవకలపై దర్యాప్తు
ABN , Publish Date - May 02 , 2026 | 06:13 AM
హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ దుర్వినియోగంపై అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ అంశంపై దర్యాప్తులో భాగంగా ఉత్తర టెక్సాస్‌కు చెందిన పలు ఐటీ కంపెనీలకు...
(డాలస్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ దుర్వినియోగంపై అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ అంశంపై దర్యాప్తులో భాగంగా ఉత్తర టెక్సాస్‌కు చెందిన పలు ఐటీ కంపెనీలకు టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ ప్యాక్స్టన్ ‘సివిల్ ఇన్వెస్టిగేటివ్ డిమాండ్స్ (సీఐడీస్)’ జారీ చేశారు. వీసా మోసాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. 30కంపెనీలకు సీఐడీలు జారీచేయగా.. వీటిలో ప్రవాసాంధ్రులకు చెందిన సంస్థలు కూడా ఉన్నాయి. టెక్‌ప్రో ఐటీ, ఫేమ్ పీబీఎక్స్, ఫస్ట్ ర్యాంకింగ్ టెక్నాలజీస్, క్యూబిట్జ్ టెక్ సిస్టమ్స్, బ్లూమింగ్ క్లౌడ్స్, విరాట్ సొల్యూషన్స్, ఓక్ టెక్నాలజీస్, టెక్‌పాత్, టెక్ క్వెన్సీ వంటి సంస్థలు అనుమానిత జాబితాలో ఉన్నాయని అటార్నీ జనరల్ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ