ఇరాన్ నావికుల్ని స్వదేశానికి పంపొద్దు!
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:10 AM
శ్రీలంక అధికారులు కాపాడిన ఇరాన్ నావికుల్ని స్వదేశానికి తిరిగి వెళ్లనివ్వొద్దని అమెరికా కోరింది. విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని స్వదేశానికి...
శ్రీలంకను కోరిన అమెరికా
కొలంబో, మార్చి 7: శ్రీలంక అధికారులు కాపాడిన ఇరాన్ నావికుల్ని స్వదేశానికి తిరిగి వెళ్లనివ్వొద్దని అమెరికా కోరింది. విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని స్వదేశానికి తిరిగివెళ్తున్న ఇరాన్ యుద్ధనౌక ‘ఐఆర్‌ఐఎస్ దేనా’ను ఈనెల 4న శ్రీలంక తీరంలో అమెరికా జలాంతర్గామితో దాడి చేసి ముంచేసిన విషయం తెలిసిందే. నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉండగా, 32 మందిని శ్రీలంక నావికాదళం కాపాడింది. 87 మృతదేహాలను వెలికి తీసింది. అలాగే, ఇరాన్ నౌకాదళానికి చెందిన సహాయక నౌక ‘ఐఆర్‌ఐఎస్ బుషెహర్’ ఈనెల 5న శ్రీలంక సముద్ర జలాలకు సమీపంలో చిక్కుకుపోవడంతో అందులో ఉన్న 208 మందిని కాపాడేందుకు శ్రీలంక నేవీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే వారందరినీ తిరిగి ఇరాన్‌కు వెళ్లనివ్వొద్దంటూ కొలంబోలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి(చార్జ్ డి-అఫైర్స్) జేనే హోవెల్ శ్రీలంక ప్రభుత్వాన్ని కోరారు. వారందరూ యుద్ధం ముగిసే వరకు శ్రీలంక అదుపులోనే ఉండాలని స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
టీమిండియాలో ప్రతి ప్లేయర్ డేంజరే.. మేం చాలా జాగ్రత్తగా ఆడాలి: కివీస్ కెప్టెన్ శాంట్నర్
ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్